Twitter Direct Messages : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ట్విట్టర్ ఏది ఫ్రీగా ఇవ్వదు.. బ్లూ టిక్ లేకుండా DM మెసేజ్ పంపితే ఛార్జీలు తప్పవు!

Twitter Direct Messages : బ్లూ టిక్ లేని యూజర్లు తమ స్నేహితులు లేదా ఫాలోవర్లకు ఏదైనా డైరెక్ట్ మెసేజింగ్ (DM) పంపితే దానికి ఛార్జీలు చెల్లించాల్సిందిగా ఎలన్ మస్క్ కంపెనీ మరో కొత్త ఫిట్టింగ్ పెట్టింది.

Twitter Direct Messages : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) తమ యూజర్లకు షాకుల మీద షాకులిస్తోంది. కొత్త రూల్స్ పేరుతో ట్విట్టర్ యూజర్ల నుంచి అందినకాడికి డబ్బులను దండుకుంటోంది. ఇటీవలే, బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ పొందాలంటే డబ్బులు చెల్లించాలన్న ట్విట్టర్.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్లూ టిక్ లేని యూజర్లకు కొత్త ఫీచర్ ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు అడుగుతోంది. బ్లూ టిక్ లేకుండా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు డైరెక్ట్ మెసేజింగ్ (Direct Messages) ద్వారా మెసేజ్ పంపితే ఛార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఎలన్ మస్క్ కంపెనీ కొత్త ఫిట్టింగ్ పెట్టింది.

ఎందుకంటే.. ప్లాట్‌ఫారంపై స్పామ్‌ను తగ్గించడానికే అంటోంది. వినియోగదారులను పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందేలా చేసేందుకు, వెరిఫై చేయని అకౌంట్ల కోసం డైరెక్ట్ మెసేజ్‌లపై రోజువారీ పరిమితులను విధించడానికి ట్విట్టర్ ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. వెరిఫైడ్ చేయని ట్విట్టర్ యూజర్లకు మెసేజ్ సామర్థ్యాలను పరిమితం చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మరింత మెరుగుపరచేలా ప్రోత్సహిస్తోంది.

బ్లూ టిక్ లేని ట్విట్టర్ వినియోగదారులు తమ స్నేహితులు, ఫాలోవర్లకు డైరెక్ట్ మెసేజ్ పంపినందుకు ఛార్జీ విధిస్తున్నట్టు తెలిపింది. ట్విట్టర్ తన సబ్‌స్క్రిప్షన్ సర్వీస్, ట్విట్టర్ బ్లూ కోసం సైన్ అప్ చేయడానికి ఎక్కువ మంది యూజర్లను ప్రోత్సహించడానికి ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఈ కొత్త మార్పులు చేస్తోంది. డైరెక్ట్ మెసేజ్‌లలో స్పామ్‌ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెరిఫై చేయని అకౌంట్ల నుంచి పంపే మెసేజ్‌ల సంఖ్యపై కంపెనీ త్వరలో రోజువారీ పరిమితులను విధించనుంది. ట్విట్టర్‌లో మీ ప్రొఫైల్‌కు బ్లూ టిక్ లేకపోతే.. మీరు ప్లాట్‌ఫారమ్‌లో అన్‌లిమిటెడ్ డైరెక్ట్ మెసేజ్‌లను పంపలేరని గమనించాలి.

Read Also : Amazon Employees : అమెజాన్ కొత్త వర్క్ పాలసీ.. వస్తే రండి.. పోతే పోండి.. వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సిందే..!

వెరిఫై చేయని అకౌంట్లపై రోజువారీ పరిమితులు :
జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం రోజువారీ పరిమితులను విధిస్తుంది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక ‘message request inbox’కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది.

Twitter users without blue tick will be charged for sending Direct Messages to their friends, followers

గతంలో ప్రతి ఒక్కరి నుంచి డైరెక్ట్ మెసేజ్‌లను ప్రారంభించిన వినియోగదారులు ఆటోమాటిక్‌గా ఈ కొత్త సెట్టింగ్‌కి మారిపోతారు. అంటే.. ట్విట్టర్ బ్లూ సబ్ స్ర్కిప్షన్ కోసం డబ్బు చెల్లించని యూజర్లు ఇకపై వాటిని ఫాలో చేయని వారికి మెసేజ్ చేయలేరు. ట్విట్టర్ జూన్ 2023లో ఈ ఫీచర్‌ని టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. అధికారికంగా జూలై 14న ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. ట్విట్టర్ ప్రకారం.. ఈ కొత్త మార్పు ఇప్పటికే గత వారంతో పోలిస్తే.. డైరెక్ట్ మెసేజ్‌లలో స్పామ్‌లో 70 శాతం తగ్గింపునకు దారితీసింది.

టెంపరరీ ట్వీట్ రీడింగ్ లిమిట్, బ్యాక్‌ట్రాకింగ్ :
ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లో బ్లూ టిక్ కోసం సైన్ అప్ చేయకుంటే.. ప్రతిరోజూ చదవగలిగే ట్వీట్ల సంఖ్యపై ‘తాత్కాలిక’ పరిమితిని విధించాడు కంపెనీ యజమాని ఎలన్ మస్క్. ఈ చర్యతో చందాదారులు కానివారిపై పరిమితులను విధించింది. అదనంగా, కంపెనీ లాగిన్ చేయని వినియోగదారుల కోసం వెబ్‌లో ట్వీట్‌లు, వ్యాఖ్యలకు యాక్సెస్‌ను పరిమితం చేసింది. అయితే, ట్విట్టర్ చివరికి జూలై 5న ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఎందుకంటే? :
ట్విట్టర్ బ్లూ అనేది ప్లాట్‌ఫారమ్‌లో ముఖ్యమైనది. యాడ్స్ కన్నా ఎక్కువ ఆదాయాన్ని విస్తరించే లక్ష్యంతో మస్క్ ఈ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకొచ్చాడు. సంస్థ భవిష్యత్తు వృద్ధికి కీలకం కూడా. ముఖ్యంగా మస్క్ అప్పుల బారిన పడిన సోషల్ మీడియా సంస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఉచితంగా అందుబాటులో ఉన్న అనేక ఫీచర్లు.. ఇప్పుడు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్ అయ్యాయి. వెరిఫై కాని అకౌంట్లు, ఇతర మార్పుల కోసం రోజువారీ మెసేజ్ లిమిట్ ద్వారా ట్విట్టర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం, స్పామ్‌ను తగ్గించడం, మరింత మంది వినియోగదారులను బ్లూ టిక్ సర్వీసులో భాగం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Samsung Galaxy Z Flip 5 Launch : ఈ నెల 26న శాంసంగ్ మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు