Jio 5G data Plans : జియో యూజర్లకు అలర్ట్.. ఇకపై అన్ని ప్లాన్లలో 5జీ డేటా రాదు.. ఎంత చెల్లించాలంటే?

Jio 5G data Plans : జూలై 3 నుంచి రిలయన్స్ జియో రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లపై మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది.

Jio 5G data Plans : జియో యూజర్లకు అలర్ట్.. ఇకపై అన్ని ప్లాన్లలో 5జీ డేటా రాదు. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భారీ మార్పులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మొబైల్ రీఛార్జ్ ధరలు జూలై 3, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

జియో తమ 5జీ సర్వీసుల నుంచి ఆదాయాన్ని పెంచడం, యూజర్ సగటు ఆదాయాన్ని పెంచే ప్లాన్లకు అనుగుణంగా ధరలను దాదాపు 12 శాతం (ARPU) పెంచింది. రీఛార్జ్ ధరల పెంపును కొంతకాలంగా ఊహాగానాలు వచ్చిన తర్వాత జియో భారీగా టారిఫ్ ధరలను పెంచి వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.

Read Also : Amazon Prime Day Sale 2024 : అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2024.. భారత్‌లో ఎప్పటినుంచంటే? బ్యాంకు ఆఫర్లు, డీల్స్

జియో ఇకపై నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించదని గమనించాలి. జూలై 3 నుంచి రిలయన్స్ జియో రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లపై మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటా లేదా అంతకంటే తక్కువ ఉన్న ప్లాన్‌లు 5జీ ఇంటర్నెట్ డేటాకు యాక్సెస్ పొందలేవు. 5జీ ఇంటర్నెట్ డేటాను అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను అందిస్తుంది.

జియో 5జీ డేటాతో 28 రోజుల ప్లాన్లు :
రూ. 349 ప్లాన్ : గతంలో రూ. 299, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 349, రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.
రూ. 399 ప్లాన్ : గతంలో రూ. 349, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 399, రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.
రూ. 449 ప్లాన్ : గతంలో రూ. 399, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 449, రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.

జియో 5జీ డేటాతో 56 రోజుల ప్లాన్లు :
రూ. 629 ప్లాన్ : గతంలో రూ. 533, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 629, రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.

5జీ బెనిఫిట్స్ జియో 84 రోజుల ప్లాన్లు :
రూ. 859 ప్లాన్ : గతంలో రూ. 719, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 859, రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.
రూ. 1199 ప్లాన్ : గతంలో రూ. 999, ఈ ప్లాన్ ధర రూ. 1199, రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.

5జీ బెనిఫిట్స్ జియో వార్షిక ప్లాన్లు :
రూ. 3599 ప్లాన్ : గతంలో రూ. 2999, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 3599, రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 365 రోజుల పాటు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది.

జియో ఇతర ప్లాన్‌లు :
రూ. 189 ప్లాన్ : గతంలో రూ. 155, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 189, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్
రూ. 249 ప్లాన్ : గతంలో రూ. 209, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 249, రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్
రూ. 299 ప్లాన్ : గతంలో రూ. 239, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 299, రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్
రూ. 579 ప్లాన్ : గతంలో రూ. 479, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 579, రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్

రూ. 799 ప్లాన్ : గతంలో రూ. 666, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 799, రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ. 1899 ప్లాన్ : గతంలో రూ. 1559, ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 1899, 336 రోజుల పాటు 24జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్

జియో కొత్త సర్వీసులు ప్రకటన :
జియో రెండు కొత్త అప్లికేషన్‌లను కూడా ప్రవేశపెట్టింది. జియోసేఫ్ (JioSafe) క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్, జియో ట్రాన్సులేట్ (JioTranslate), ఏఐ-ఆధారిత మల్టీ లాంగ్వేజీ కమ్యూనికేషన్ యాప్. ఈ రెండు సర్వీసులు జియో కస్టమర్లకు ఒక ఏడాది పాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రెన్యువల్ ప్లాన్‌లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : Tesla Screen : మస్క్ మామ.. నా టెస్లా స్ర్కీన్‌పై బగ్ ఫిక్స్ చేస్తావా? చైనా చిన్నారి రిక్వెస్ట్.. టెక్ బిలియనీర్ రియాక్షన్..!

ట్రెండింగ్ వార్తలు