Amazon Employees : అమెజాన్ కొత్త వర్క్ పాలసీ.. వస్తే రండి.. పోతే పోండి.. వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సిందే..!

Amazon Employees : అమెజాన్ కొత్త ఆఫీస్ వర్క్ పాలసీని ప్రవేశపెట్టింది. కొంతమంది ఉద్యోగులు వారానికి 3 రోజులు వ్యక్తిగతంగా పని చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా గత ఏడాదిలో తొలగింపుల తర్వాత ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది.

Amazon Employees : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సరికొత్త పాలసీలతో ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోంది. అమెజాన్ ఉద్యోగులు పని చేసే విధానంలో కంపెనీ మార్పులు చేస్తోంది. కొంతమంది ఉద్యోగులు ప్రతి వారం 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందిగా సూచించింది. దాంతో కంపెనీ, ఉద్యోగుల మధ్య కొంత ఉద్రిక్తతకు కారణమైంది. ప్రత్యేకించి గత ఏడాదిలో అమెజాన్ అనేక మంది ఉద్యోగులను తొలగించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెజాన్ తమ ఆఫీసులో ఏ ఉద్యోగులు పని చేయాలి? వారు ఎప్పుడు ఉండాలో ప్రతి సెక్షన్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం, ఈ కొత్త మార్పుతో కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారో అమెజాన్ నిర్ణయించలేదు.

కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులను ఆఫీసుకు దగ్గరగా ఉండాలని కోరింది. అప్పుడు వారానికి 3 రోజులు ఆఫీసుకు రావడానికి వీలుంటుందని కంపెనీ పేర్కొంది. వారానికి కనీసం 3 రోజులు ఆఫీసులో కలిసి పనిచేయడం వల్ల ఉద్యోగులు మరింత శక్తివంతంగా తయారయ్యారని, ఆఫీసుల సమీపంలోని బృందాలు, వ్యాపారాల మధ్య సహకారం మెరుగుపడుతుందని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకే ఆఫీసు లొకేషన్లలో మరిన్ని టీమ్‌లను పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తద్వారా ఏవైనా నిర్ణయాల గురించి నేరుగా ఉద్యోగులకు తెలియజేయడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

Read Also : Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?

‘వారానికి కనీసం 3 రోజులు కలిసి ఆఫీసుల్లో పని చేస్తున్నందున మంచి సహకారంతో పాటు సత్సంబంధాలు పెరుగుతున్నాయి. ఆఫీసుల్లో అదే స్థానాల్లో కలిసి పనిచేసేందుకు మరిన్ని బృందాలను ఒకచోట చేర్చడానికి అనేక మార్గాలను పరిశీలిస్తూనే ఉన్నాం. రోజువారీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగులతో నేరుగా కమ్యూనికేట్ చేయొచ్చు’ అని కంపెనీ తెలిపింది.

Amazon to force employees to relocate for 3 days a week in-office work

గత ఏడాదిలో అమెజాన్‌లో అనేక మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత సుమారు 27వేల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. గత మేలో అమెజాన్ కార్పొరేట్ సిబ్బందిలో చాలా మందిని వారానికి కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాలని కోరింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు సీటెల్‌లో నిరసనకు దిగారు.

అమెజాన్‌లో తొలగింపులు :
అమెజాన్ 2023లో మొత్తం 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. జనవరిలో ప్రకటించిన తొలి రౌండ్ తొలగింపుల్లో 18వేల మంది ఉద్యోగులను ప్రభావితం చేశాయి. మార్చిలో ప్రకటించిన రెండో రౌండ్ తొలగింపులు 9వేల మంది ఉద్యోగులను ప్రభావితం చేశాయి. కంపెనీలో అన్ని స్థాయిలు, విధుల్లోని ఉద్యోగుల తొలగింపులతో తీవ్ర ప్రభావం చూపాయి.

యునైటెడ్ స్టేట్స్, యూరప్, భారత్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. అమెజాన్‌ కంపెనీలో ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా తొలగింపులు ఉన్నాయి. వాల్‌మార్ట్, టార్గెట్ వంటి ప్రత్యర్థుల నుంచి పెరుగుతున్న పోటీని సంస్థ ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు కూడా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే అమెజాన్ అనేక మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

Read Also : Netflix Account New Rules : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కొత్త రూల్స్ ఇవే.. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాస్‌‌వర్డ్ షేరింగ్ విధానం ఎలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు