Samsung Galaxy M35 5G : అదిరే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ M35 5జీ ఫోన్ వస్తోంది.. అమెజాన్‌ ప్రైమ్ డేలో సేల్?

Samsung Galaxy M35 5G : అమెజాన్ వెబ్‌సైట్‌ శాంసంగ్ గెలాక్సీ M35 5జీ భారత్ మార్కెట్లో లాంచ్‌ను రివీల్ చేసింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M35 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. అద్భుతమైన ఫీచర్లతో ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో శాంసంగ్ గెలాక్సీ M35 5జీ భారత మార్కెట్లోకి త్వరలో రాబోతోంది. గత మేలో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్‌లలో లాంచ్ అయింది.

Read Also : Amazon Prime Day Sale 2024 : అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2024.. భారత్‌లో ఎప్పటినుంచంటే? బ్యాంకు ఆఫర్లు, డీల్స్

ఇప్పుడు, శాంసంగ్ ఈ M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌కు తీసుకురావాలని చూస్తోంది. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, అమెజాన్ హ్యాండ్‌సెట్ రాకను రివీల్ చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 సమయంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ M35 5జీ 25డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ ఫోన్ :
అమెజాన్ వెబ్‌సైట్‌లోని బ్యానర్ ద్వారా గెలాక్సీ M35 5జీ భారత్ మార్కెట్లో లాంచ్‌ను రివీల్ చేసింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే, బ్యానర్ కచ్చితమైన లాంచ్ తేదీ, సమయాన్ని వెల్లడించలేదు.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఫోన్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్‌లను పొందడానికి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని “Notify Me” బటన్‌పై క్లిక్ చేయవచ్చు. బ్రెజిల్‌లో, గెలాక్సీ ఎమ్35 5జీ సింగిల్ 8జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ బీఆర్ఎల్ 2,699 (దాదాపు రూ. 43,400)కి రిటైల్ అవుతుంది. బ్రైట్ బ్లూ, గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. శాంసంగ్ ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఇదే ధర విభాగంలో లాంచ్ చేయాలని భావిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ స్పెసిఫికేషన్స్ :
శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ గ్లోబల్ వేరియంట్ 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,340 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 1,000నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీతో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజీనీ 1టీబీ వరకు విస్తరించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గెలాక్సీ ఎమ్35 5జీ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : Tesla Screen : మస్క్ మామ.. నా టెస్లా స్ర్కీన్‌పై బగ్ ఫిక్స్ చేస్తావా? చైనా చిన్నారి రిక్వెస్ట్.. టెక్ బిలియనీర్ రియాక్షన్..!

ట్రెండింగ్ వార్తలు