Samsung Galaxy Z Flip 5 Launch : ఈ నెల 26న శాంసంగ్ మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్..!

Samsung Galaxy Z Flip 5 Launch : శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ ధర బేస్ 256GB వేరియంట్ ధర EUR 1,199 (సుమారు రూ. 1,09,830) నుంచి ప్రారంభమవుతుంది. ముందున్న గెలాక్సీ Z Flip 4 ఫోన్ 128GB మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 89,999కి విక్రయించింది.

Samsung Galaxy Z Flip 5 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy) అన్‌ప్యాక్డ్ 2023 ఈవెంట్ హోస్ట్ చేస్తుంది. కొత్త గెలాక్సీ Z ఫ్లిప్ 5, గెలాక్సీ Z ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 మోడల్ పెద్ద మార్పుతో రాబోతోంది. లాంచ్‌కు ముందు.. టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ అధికారికంగా రెండర్‌లను షేర్ చేసింది. అందులో కలర్ ఆప్షన్లలో ఫుల్ డిజైన్‌ను అందిస్తుంది. గెలాక్సీ Z ఫ్లిప్ 5 భారీ డిస్‌ప్లేను అందిస్తుందని పాత లీక్‌ ధృవీకరిస్తాయి. ఇప్పటికే మోటోరోలా Razr 40 Ultra/ Plusలో ఆకుపచ్చ, నలుపు, గులాబీ, క్రీమ్ కలర్ ఆప్షన్లలను అందిస్తుంది.

ఫ్రేమ్ మెటల్ ఎండ్ కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాసుతో రావొచ్చు. గెలాక్సీ Z Flip 5 ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలో కెమెరాలను అందిస్తుంది. వినియోగదారులు వీడియోలను రికార్డ్ చేసేందుకు లేదా స్టిల్ ఇమేజ్‌లను తీసేందుకు మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రధాన డిస్‌ప్లేలో సెల్ఫీలలో కెమెరా కూడా పొందవచ్చు. ఫొటోలు, కాంపాక్ట్ నిర్మాణాన్ని అందించనుంది. శాంసంగ్ మోటోరోలా Razr 40 Ultra కలిగిన 6.9-అంగుళాల స్క్రీన్ మాదిరిగా కాకుండా బ్యాక్ సైడ్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందించవచ్చు. ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లే 3.4 అంగుళాలు ఉండవచ్చు. మోటోరోలా Razr 40 ఫోన్‌లో 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది.

Samsung Galaxy Z Flip 5 Launch : Samsung Galaxy Z Flip 5 design, colour options leaked ahead of July 26 launch

Read Also : Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?

Blass ట్వీట్లలో Galaxy Z Flip 5 బేస్ వేరియంట్ 256GB స్టోరేజీని అందించే అవకాశం ఉంది. అయితే, టాప్ వేరియంట్ 512GB ఇంటర్నల్ మెమరీని అందించవచ్చు. మరోవైపు, గరిష్టంగా 1TB స్టోరేజీని అందిస్తుంది. గెలాక్సీ Z Flip 5 ఫోన్ 3,700mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. 25W ఛార్జింగ్‌తో ఉండవచ్చు. శాంసంగ్ బాక్స్‌తో ఛార్జింగ్ అందించడం లేదు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో మరో లీక్ ధరల గురించి వివరాలను అందించింది. శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ధర బేస్ 256GB వేరియంట్ ధర EUR 1,199 (సుమారు రూ. 1,09,830) నుంచి ప్రారంభమవుతుంది.

ముందున్న గెలాక్సీ Z Flip 4 ఫోన్ 128GB మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 89,999కి ప్రకటించింది. 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.94,999గా ఉంది. Motorola, Oppo కంపెనీల్లో మోటోరోలా Razr 40 Ultra, Oppo Find N2 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఒకే ప్రారంభ ధరకు (256GB) అందిస్తుంది. శాంసంగ్ చాలా ఏళ్లుగా ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ స్పేస్‌లో ఉండటంతో కస్టమర్‌లు కంపెనీపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు.

Read Also : Amazon Employees : అమెజాన్ కొత్త వర్క్ పాలసీ.. వస్తే రండి.. పోతే పోండి.. వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయాల్సిందే..!

ట్రెండింగ్ వార్తలు