Most Affordable Cars : కొత్త కారు కోసం చూస్తున్నారా? అత్యంత సరసమైన 3 కార్లు ఇవే.. కేవలం ధర రూ. 5 లక్షల లోపు మాత్రమే!

Most Affordable Cars : మీరు రూ. 5 లక్షల లోపు కార్ల కోసం వెతుకుతుంటే ఇదే మీకు సరైన అవకాశం.. మొత్తం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఏదైనా ఎంచుకుని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Most Affordable Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో టాప్ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 5 లక్షల లోపు కార్ల కోసం వెతుకుతుంటే ఇదే మీకు సరైన అవకాశం.. మొత్తం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు భారతీయ మార్కెట్‌లో ఈ ధర కన్నా తక్కువ మోడల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కాదు. కార్లు ఖరీదైనవిగా మారాయి.

Read Also : Infinix Note 40S 4G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40S 4జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్‌లు, డిజైన్ రివీల్!

సరసమైన కార్లను అందించే కొన్ని కార్ల తయారీదారులు భారత్ విడిచిపెట్టారు. కొందరు తక్కువ-ధర మోడల్‌లను నిలిపివేసారు. ప్రీమియం మోడళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు కేవలం మూడు ఆప్షన్లలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ కార్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఏదైనా ఎంచుకుని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

మారుతి సుజుకి ఆల్టో కె10 :
ఆల్టో ఇండియా అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే. ఆల్టో 800 గత ఏడాదిలో నిలిపివేయగా ఇప్పుడు ఆల్టో K10ని మాత్రమే పొందవచ్చు. ఆల్టో కె10 ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 67PS గరిష్ట శక్తిని, 89Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. మీరు రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు మాన్యువల్ ఆప్షన్ (5-స్పీడ్ MT) మాత్రమే పొందుతారు.

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో :
ఎస్-ప్రెస్సో మారుతి అందించే మరో సరసమైన మోడల్. దీని ప్రారంభ ధర రూ. 4.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎస్-ప్రెస్సో ఆల్టో కె10లో ఇంజన్‌ను కలిగి ఉంది. అలాగే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కారు బేస్ వేరియంట్ మాత్రమే రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు వస్తుంది.

రెనాల్ట్ క్విడ్ :
రెనాల్డ్ క్విడ్.. ఒకప్పుడు 0.8-లీటర్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండేది. గత ఏడాది చిన్న ఇంజిన్‌ను తొలగించగా ఇప్పుడు పెద్ద ఇంజిన్‌గా మిగిలిపోయింది. క్విడ్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). క్విడ్ 1.0-లీటర్ ఎస్‌సీఈ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 68పీఎస్ శక్తిని 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. రూ. 5 లక్షలలోపు (ఎక్స్-షోరూమ్), మీరు 5-స్పీడ్ ఎంటీ మాత్రమే పొందుతారు. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో నేటి కార్లు ఖరీదైనవిగా మారాయి. ఇన్‌పుట్ ఖర్చులలో మెటీరియల్ ఖర్చులు అత్యధికంగా పెరిగాయి.

కార్‌మేకర్‌లు ఇన్‌పుట్ ఖర్చుల్లో ఎక్కువ భాగాన్ని వివిధ మోడళ్లపై ధరల పెంపు ద్వారా కస్టమర్‌లకు కొంత భారాన్ని మోపుతున్నారు. ఇంతకుముందు రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ప్రారంభమైన కొన్ని కార్లు ఇప్పుడు ఈ ధర కన్నా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎంట్రీ-లెవల్ మోడల్‌లకు డిమాండ్ తగ్గిపోతోంది. కార్లలో వాల్యూమ్‌లను బట్టి ధరలో హెచ్చుతగ్గుదల చూడవచ్చు. ఇటీవల కొనుగోలుదారులు ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కార్లను కొనేందుకు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటున్నారు.

Read Also : Oppo Reno 12 5G Series : ఏఐ ఫీచర్లతో ఒప్పో నుంచి రెండు సరికొత్త 5జీ సిరీస్ ఫోన్లు.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు