CMF Phone 1 Launch : పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో సీఎంఎఫ్ ఫోన్ 1 వస్తోంది.. ఫీచర్లు ఇవేనా? భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

CMF Phone 1 Launch : యూరప్‌లో ఇదే ఫోన్ ధర దాదాపు రూ.44వేలుగా కంపెనీ నిర్ణయించింది. రాబోయే సీఎమ్ఎఫ్ ఫోన్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఇతర స్పెసిఫికేషన్‌లను ఏదీ వెల్లడించలేదు.

CMF Phone 1 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి సీఎమ్ఎఫ్ బై నథింగ్ నుంచి మొట్టమొదటి ఫోన్ రాబోతోంది. ఈ సీఎమ్ఎఫ్ ఫోన్‌ అధికారిక లాంచ్‌కు ముందుగానే ఫోన్ చిప్‌సెట్ పేరును కంపెనీ రివీల్ చేసింది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 అత్యుత్తమ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అకిస్ ఎవాంజెలిడిస్ పేర్కొన్నారు. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని పలు నివేదికలు కూడా పేర్కొన్నాయి. సీఎమ్ఎఫ్ ఫోన్ సెగ్మెంట్‌లో వేగవంతమైన చిప్‌సెట్‌ని కలిగి ఉంటుందని తెలిపాయి.

Read Also : Most Affordable Cars : కొత్త కారు కోసం చూస్తున్నారా? అత్యంత సరసమైన 3 కార్లు ఇవే.. కేవలం ధర రూ. 5 లక్షల లోపు మాత్రమే!

కంపెనీ ఇంకా ఈ ఫోన్ ధర వివరాలను ధృవీకరించనప్పటికీ, సీఎమ్ఎఫ్ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 15,999కి అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ పేర్కొన్నారు. ఈ ఫోన్ ధర రూ. 20వేల లోపు ఉంటుందని మరో నివేదిక సూచిస్తుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్ఓసీతో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. ఈ 5జీ ప్రాసెసర్ 8-కోర్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. టీఎస్ఎమ్‌సీ నుంచి 4ఎన్ఎమ్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్ బ్యాకప్‌తో వస్తుంది.

రూ.20వేల లోపు కేటగిరీలో గట్టి పోటీ :
ఇతర ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ లేదా డైమన్షిటీ 7050 చిప్‌తో వచ్చినందున ఈ ఫోన్ రూ. 20వేల లోపు ప్రస్తుత ఫోన్‌లకు చాలా గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 12 అదే చిప్‌తో యూరప్‌లో లాంచ్ కానుంది. భారత మార్కెట్లో లాంచ్ కాగానే దాదాపు రూ. 40వేల ఖర్చు అవుతుందని గమనించాలి.

యూరప్‌లో ఇదే ఫోన్ ధర దాదాపు రూ.44వేలుగా కంపెనీ నిర్ణయించింది. రాబోయే సీఎమ్ఎఫ్ ఫోన్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఇతర స్పెసిఫికేషన్‌లను ఏదీ వెల్లడించలేదు. అయితే, కంపెనీ షేర్ చేసిన వీడియోలో బ్యాక్ సైడ్ స్క్రూ ఉన్నందున దానిని తీసివేయవచ్చని టీజర్‌లు సూచించాయి.

జూలై 8న భారత మార్కెట్లో లాంచ్? :
ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, ఆరంజ్ కలర్ ఆప్షన్లలో విక్రయించనున్నట్టు లీక్‌లు సూచించాయి. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మోడల్ జూలై 8న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ (cmf.tech)లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1తో పాటు, బ్రాండ్ వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2 డివైజ్‌లను కూడా లాంచ్ చేస్తుంది.

ఇయర్‌ఫోన్‌లు స్మార్ట్ డయల్‌తో కూడా వస్తాయని టీజర్‌ వెల్లడించింది. ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించి మ్యూజిక్ కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కచ్చితంగా ఎలా పని చేస్తుందో ప్రస్తుతానికి తెలియదు. వాచ్ ప్రో 2 వాచ్ ఫేస్‌లను రూపొందించడానికి, ఫంక్షన్‌లను కస్టమైజ్ చేయడానికి అనుమతిస్తుంది.

Read Also : Whatsapp Events : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూప్ చాట్స్‌లో ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు