Samsung Galaxy S26 Series : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?
Samsung Galaxy S26 Series : గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2026లో శాంసంగ్ మొత్తం 3 ఫోన్లను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలివే
Samsung Galaxy S26 Series
- అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ సిరీస్ వచ్చేసింది
- శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 గెలాక్సీ ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా ధరలు
- గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ బడ్స్ 4తో లాంచ్
Samsung Galaxy S26 Series : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. సౌత్ కొరియన్ దిగ్గజం నుంచి సరికొత్త గెలాక్సీ S సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ బడ్స్ 4తో పాటు గెలాక్సీ S26 సిరీస్ వచ్చేసింది.
ఈ సిరీస్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా అనే 3 కొత్త ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే శాంసంగ్ స్పెసిఫికేషన్లు, కెమెరా, డిజైన్ పరంగా అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఈ లైనప్ నుంచి 3 శాంసంగ్ ఫోన్లకు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రా ధరలు :
అధికారిక శాంసంగ్ స్టోర్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 మార్కెట్లో ప్రారంభ ధర రూ.87,999కు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ ప్రారంభ ధర రూ.1,19,999కు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మార్కెట్లో ప్రారంభ ధర రూ.1,39,999కు కొనేసుకోవచ్చు.
Read Also : Apple iPhone Air : ఆఫర్ అదిరింది బ్రో.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఫుల్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా :
ఈ శాంసంగ్ ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై శాంసంగ్ వన్ యూఐ 8.5 స్కిన్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 200MP + 50MP అల్ట్రా వైడ్ + 50MP టెలిఫోటో + 10MP టెలిఫోటో, సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ అందిస్తుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 60W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ థర్డ్ జనరేషన్ ఏఐ స్మార్ట్‌ఫోన్ గత సిరీస్ కన్నా చాలా స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ :
ఈ శాంసంగ్ ప్లస్ ఫోన్ కూడా ఇలాంటి డిస్ప్లేతో వస్తుంది. కానీ, సైజు కొంచెం చిన్నదిగా ఉంటుంది. 6.7-అంగుళాలతో పాటు ప్రాసెసర్, స్టోరేజ్‌లో కూడా ఎలాంటి తేడాలు కనిపించవు. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP వైడ్ + 12MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా అల్ట్రా వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4900mAh బ్యాటరీ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S26 :
బేస్ వేరియంట్ కూడా ఇదే డిస్ప్లేతో వస్తుంది. 6.3 అంగుళాల సైజు ఉంటుంది. ప్రాసెసర్ నుంచి ర్యామ్ వరకు అన్ని ఫీచర్లు ఇతర రెండు ఫోన్ల మాదిరిగానే ఉంటాయి. ప్లస్ వేరియంట్ నుంచి ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఈ బేస్ వేరియంట్ 4300mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
