Tech Tips in Telugu : పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులను వాడుతున్నారా? స్కామర్లతో జాగ్రత్త.. మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు.. సేఫ్‌గా ఉండాలంటే?

Tech Tips in Telugu : పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులతో తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు మీ ఫోన్ డివైజ్‌లను హ్యాక్ చేస్తారు. మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఖాళీ చేస్తారు.

Tech Tips in Telugu : స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్ ఛార్జింగ్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగిస్తున్నారా? అయితే స్కామర్లు మీ డబ్బును దొంగిలించే ప్రమాదం ఉంది. సైబర్ స్కామర్‌లు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సున్నితమైన యూజర్ డేటాను దొంగిలించడానికి విమానాశ్రయాలు, హోటళ్లు, కేఫ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను వాడుతున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లు చూడటానికి చాలా సురక్షితమైనవిగా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయినప్పుడు.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువమంది ఈ పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులపైనే ఆధారపడుతుంటారు.

సాధారణంగా స్టేషన్‌లు, ఇతర పబ్లిక్ ఏరియాలలో కనిపించే పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లు సైతం స్కామర్లకు లక్ష్యంగా మారుతున్నాయి. స్కామర్‌లు ‘జ్యూస్ జాకింగ్’ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌లను హ్యాక్ చేయడానికి పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను వినియోగిస్తుంటారు. ఆర్థిక లాభం కోసం సున్నితమైన సమాచారాన్ని స్కామర్లు యాక్సెస్ చేస్తారు. ఈ కుంభకోణం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మారింది.

Read Also : Tech Tips in Telugu : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి!

అంతకుముందు, పబ్లిక్ ఛార్జింగ్ డాక్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అమెరికాలోని వినియోగదారులకు FBI హెచ్చరిక జారీ చేసింది. మాల్స్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో కనిపించే పబ్లిక్ ఛార్జర్‌లపై ఆధారపడకుండా సొంత పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లాలని FBI సూచించింది. అయితే, అసలు జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి? స్కామర్‌లు ఈ పబ్లిక్ సౌకర్యాలను ఎలా మోసాలకు ఉపయోగించుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి? : 
జ్యూస్ జాకింగ్ అనేది ఒక రకమైన సైబర్‌టాక్.. స్కామర్లు బహిరంగ ప్రదేశాల్లో ఫేక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు వాటికి ప్లగ్ చేసిన డివైజ్‌ల నుంచి సున్నితమైన డేటాను రహస్యంగా దొంగిలించవచ్చు. ఎవరైనా తమ డివైజ్ ఫేక్ ఛార్జింగ్ పోర్ట్‌లోకి ప్లగ్ చేసినప్పుడు.. స్కామర్‌లు తమ డివైజ్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు. పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇతర ప్రైవేట్ డేటా వంటి వ్యక్తిగత డేటాను సేకరించడం ప్రారంభించవచ్చు. కొన్ని సందర్భాల్లో, స్కామర్‌లు నేరుగా బాధితుడి డివైజ్‌లోకి మాల్‌వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చు. తద్వారా డివైజ్ రిమోట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు.

Tech Tips in Telugu : Scammers are now stealing money using public charging ports

స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
* సాధారణంగా ఛార్జింగ్ స్టేషన్‌లు ఫేక్ లేదా ఒరిజినల్ అని గుర్తించడం వినియోగదారులకు కష్టమే.
* ఈ సైబర్ దాడి నుంచి మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవడంలో మీకు సాయపడే కొన్ని సెక్యూరిటీ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.
* మీ డివైజ్ సెక్యూరిటీని నిర్ధారించడానికి మీ సొంత ఛార్జర్‌ని తీసుకురావడంతో పాటు అనధికారిక డేటా ట్రాన్స్‌ఫర్ నివారించడం మంచిది.
* ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఛార్జింగ్ అవసరమైతే.. ఎల్లప్పుడూ పోర్టబుల్ పవర్ బ్యాంక్‌ని తీసుకెళ్లండి.
* అదనపు భద్రత కోసం USB డేటా బ్లాకర్‌ని ఉపయోగించండి.
* మీ డివైజ్, ఛార్జింగ్ స్టేషన్ మధ్య డేటా ఎక్స్ఛేంజ్ నిరోధించే చిన్న అడాప్టర్‌గా పనిచేస్తుంది.
* గుర్తుతెలియని నెట్‌వర్క్‌లు లేదా డివైజ్‌లకు ఆటోమేటిక్ కనెక్షన్‌ని నివారిస్తుంది. తద్వారా మీ డివైజ్ ను ప్రొటెక్ట్ చేసకోవచ్చు.
* పాపులర్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి.
* దాడులకు గురయ్యే అవకాశం ఉన్న ఓపెన్ లేదా అసురక్షిత వాటిని నివారించండి.
* మీ డివైజ్ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం ద్వారా ప్రొటెక్ట్ చేసుకోండి.
* ఈ అప్‌డేట్స్ భద్రతా లోపాలను ఫిక్స్ చేయని ప్యాచ్‌లను కలిగి ఉంటాయి.
* అనధికార యాక్సెస్ రిస్క్ లేకుండా మీ డివైజ్ ఛార్జ్ అవుతున్నప్పుడు అన్‌లాక్ చేయరాదు.

Read Also : Tech Tips in Telugu : మీ టీవీ రిమోట్ పోయిందా? మీ స్మార్ట్‌టీవీని టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు