Tesla Screen : మస్క్ మామ.. నా టెస్లా స్ర్కీన్‌పై బగ్ ఫిక్స్ చేస్తావా? చైనా చిన్నారి రిక్వెస్ట్.. టెక్ బిలియనీర్ రియాక్షన్..!

Tesla Screen : "హలో మస్క్ మామ.. నేను చైనాకు చెందిన మోలీని. మీ టెస్లా కారు గురించి నాదొక ప్రశ్న. నేను ఏదైనా బొమ్మను గీసినప్పుడు కొన్నిసార్లు గీతలు ఇలా మాయమవుతాయి. మీరు ఫిక్స్ చేయగలరా? అని అమాయకంగా అడిగింది.

Tesla Screen : ప్రపంచ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ సొంత కంపెనీ టెస్లా కార్లలో అత్యాధునిక ఫీచర్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కార్లు ఖరీదైనవిగా మాత్రమే కాదు.. స్క్రీన్‌లు, స్పీకర్‌లు, సెన్సార్‌లతో నిండిన రోలింగ్ గాడ్జెట్‌లుగా మారాయి. టెస్లా మోడల్ ఎస్ “రోలింగ్ టాబ్లెట్” కాన్సెప్ట్‌తో నడుస్తుంది.

ఇతర కార్ల కన్నా ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. పెద్ద 17-అంగుళాల టాబ్లెట్ మాదిరిగా ఉండి కారు ప్రధాన విధులను కమ్యూనికేట్ చేస్తుంది. అలాంటి డ్రైవ్ స్ర్కీన్ సరిగా పనిచేయడం లేదంటూ చైనాకు చెందిన ఓ చిన్నారి మస్క్‌ను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. ఇటీవల తన టెస్లా వాహనంలో స్క్రీన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా ఆ చిన్నారి తెలిపింది.

Read Also : Honor 200 5G Series : భారత్‌కు రానున్న హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు.. ధర వివరాలు, ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

మస్క్ ఏమన్నాడంటే? :
అంతేకాదు.. స్క్రీన్‌పై గీస్తున్నప్పుడు గమనించిన బగ్ రిపోర్టు వీడియోను కూడా రికార్డ్ చేసింది. ఆమె వీడియోలో చిన్నారి ఇలా చెప్పింది.. “హలో మస్క్ మామ.. నేను చైనాకు చెందిన మోలీని. మీ టెస్లా కారు గురించి నాదొక ప్రశ్న ఉంది. నేను ఏదైనా బొమ్మను గీసినప్పుడు కొన్నిసార్లు గీతలు ఇలా మాయమవుతాయి.

మీరు దీన్ని చూస్తారా? మీరు ఫిక్స్ చేయగలరా? అని అమాయకంగా అడిగింది. చిన్న క్లిప్‌లో మోలీ తన సమస్యను హైలైట్ చేసింది. తన పోస్టుకు మోలీ @elonmusk #Tesla $tslaకి రిపోర్టు చేస్తున్నట్టుగా పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. చిన్నారి పోస్టుపై స్పందించిన టెస్లా సీఈఓ మస్క్ “తప్పకుండా” అంటూ రీట్వీట్ చేశారు.

చిన్నారి పోస్టుపై నెటిజన్ల స్పందన :
ఎక్స్ ప్లాట్‌ఫారంపై షేర్ అయినప్పటి నుంచి అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టుకు మిలియన్ల వ్యూస్, 14వేల లైక్‌లు వచ్చాయి. “అద్భుతం. ఈ బగ్‌ని మా అందరితో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. మస్క్ రెస్పాండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సమస్యను వివరించినందుకు చాలా బాగుంది మోలీ అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు.

మొత్తం రీకాల్ వెంటనే అవసరమని మూడవ యూజర్ కామెంట్ చేయగా, ఈ అమ్మాయిలు చాలా మంది పెద్దల కన్నా మర్యాదగా బాగా మాట్లాడతారు. ఈ వీడియోని లైక్ చేయండి అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. చైనాకు చెందిన మోలీకి నెక్ట్స్ టెస్లా స్ర్కీన్ టెస్టులో అదృష్టం కలగాలని కోరుకుంటున్నానని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈవీ కంపెనీ నాల్గవ మాస్టర్ ప్లాన్‌పై పనిచేస్తున్నట్లు మస్క్ ధృవీకరించారు. జూన్ 18న బిలియనీర్ తాను టెస్లా మాస్టర్ ప్లాన్ పార్ట్ ఫోర్‌పై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. టెస్లా కార్లలో మొదటి మోడల్ ఆగస్ట్ 2, 2006న లాంచ్ కాగా, రెండవది జూలై 2016లో, మూడోది గత ఏడాది మార్చిలో లాంచ్ అయింది. ‘టెస్లా మాస్టర్ ప్లాన్ 4పై పనిచేస్తోందని టెక్ బిలియనీర్ ఎక్స్ వేదికగా తెలిపారు.

Read Also : Amazon Prime Day Sale 2024 : అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2024.. భారత్‌లో ఎప్పటినుంచంటే? బ్యాంకు ఆఫర్లు, డీల్స్

ట్రెండింగ్ వార్తలు