SJ Suryah – Pawan Kalyan : నా ఫ్రెండ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్.. సీఎంగా మీరే చేయాలి..

నటుడు, దర్శకుడు SJ సూర్య భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

SJ Suryah Interesting Comments on AP Deputy Chief Minister Pawan Kalyan in Bharateeyudu 2 Pre Release Event

SJ Suryah – Pawan Kalyan : కమల్ హాసన్ మెయిన్ లీడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జులై 12 రాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, బ్రహ్మానందం, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య.. అనేకమంది స్టార్స్ వచ్చారు.

అయితే నటుడు, దర్శకుడు SJ సూర్య భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. SJ సూర్య మాట్లాడుతూ.. కమల్ గారు చెప్పారు ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం పని చేస్తారో వాళ్లంతా ఇండియన్స్. మీ అందరిలో ఇండియన్ ఉన్నారు. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏదో ఒక రోజు నేను ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకుంటాను అని మూడేళ్ళ క్రితం చెప్పా. ఇప్పుడు సగం పూర్తయింది. మిగతాది మీరే పూర్తిచేయాలి. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Also Read : Ram Charan : గేమ్ మార్చడానికి వస్తున్నా.. హెలికాప్టర్స్‌తో రామ్ చరణ్ పోస్ట్ వైరల్..

భారతీయుడు 2 ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగానే ఈవెంట్ కి వచ్చిన జనాలు అరుపులు కేకలతో సందడి చేశారు. పవన్ అభిమానులు కూడా ఈ వీడియో షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. SJ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఖుషి, పులి సినిమాలు చేశారు. ఈ ఇద్దరు మంచి స్నేహితులు అని కూడా తెలిసిందే.