Manchu Lakshmi: పుష్పను ఫేమస్ చేసింది నేనే.. ఆ డైలాగ్ నాదే.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
పుష్ప ఫైర్ డైలాగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి(Manchu Lakshmi).
Manchu Lakshmi says Pushpa Fire dialogue is mine
Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఏది మాట్లాడినా వైరల్ అవుతూనే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ కలిపి ఆమె మాట్లాడే మాటలు భలేగా ఉంటాయి. అందుకే, ఎప్పుడు మీమ్స్ లో ట్రెండ్ అవుతానే ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ, ఈసారి ఏకంగా బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప సినిమా గురించి ఆమె మాట్లాడింది.
Chaitu Jonnalagadda: కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చైతన్య జొన్నలగడ్డ.. ఏకంగా ధనుష్ 55లో క్రేజీ రోల్
రీసెంట్ గా ఆమె లేచింది మహిళా లోకం అనే సినిమా ఈవెంట్ లో పాల్గొంది. మహిళా దినోత్సవ సందర్బంగా ఈ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అనే డైలాగ్ వాడింది నేనే. ఆ డైలాగ్ నాదే. కావాలంటే పాత వీడియోలు చెక్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చింది. దాంతో, ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిజానికి, మంచు లక్ష్మి చెప్పింది నిజమే. చాలా కాలం క్రితమే మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఫ్లవర్ అనుకుంటారు కాదు నేను ఫైర్ అంటూ తన వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటూ ఆ డైలాగ్ ను వాడింది. ఇప్పుడు మరోసారి ఆ డైలాగ్స్ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా తాజాగా డైలాగ్స్ తో మరోసారి వైరల్ అవుతోంది మంచు లక్ష్మి.
