Ram Charan : గేమ్ మార్చడానికి వస్తున్నా.. హెలికాప్టర్స్‌తో రామ్ చరణ్ పోస్ట్ వైరల్..
తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Ram Charan Special Post on Game Changer Movie Shared a Photo with Helicopters
Ram Charan : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలుపెట్టి మూడేళ్లయినా ఒక్క సరైన అప్డేట్ లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇటీవలే డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్ పూర్తయింది. ఇంకో పది నుంచి పదిహేను రోజులు షూట్ చేస్తే సినిమా అయిపోతుంది అని తెలిపారు.
రామ్ చరణ్ షూటింగ్ అయిపోయింది అని తెలియడంతో మెగా అభిమానులు హమ్మయ్య ఇన్నాళ్లకు పూర్తయింది, త్వరలోనే సినిమా వచ్చేస్తుంది అని ఆశిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. హెలికాఫ్టర్లతో షూటింగ్ టైంలో రామ్ చరణ్ దిగిన ఫోటోలు షేర్ చేసి.. మార్పు తీసుకురావడానికి గేమ్. గేమ్ ఛేంజర్ షూట్ పూర్తయింది. థియేటర్స్ లో కలుద్దాం అని పోస్ట్ చేసారు.
దీంతో రామ్ చరణ్ డైరెక్ట్ గా గేమ్ ఛేంజర్ సినిమా గురించి పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోలో రామ్ చరణ్ హెలికాఫ్టర్ లోకి ఎక్కడానికి వెళ్తున్నట్టు పవర్ ఫుల్ గా ఉంది. ఈ ఫోటోపై కూడా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది.