Shankar – Ram Charan : కమల్ హాసన్ ముందు రామ్ చరణ్‌ని పొగిడిన డైరెక్టర్ శంకర్.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పారంటే..

భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడిన అనంతరం రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ..

Shankar – Ram Charan : కమల్ హాసన్ ముందు రామ్ చరణ్‌ని పొగిడిన డైరెక్టర్ శంకర్.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పారంటే..

Diretor Shankar Interesting Comments on Ram Charan in Bharateeyudu 2 Pre Release Event

Updated On : July 8, 2024 / 7:04 AM IST

Shankar – Ram Charan : మెగా అభిమానులు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. జులై 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో మూవీ యూనిట్ అంతా ప్రమోషన్స్ లో ఉన్నారు. తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, బ్రహ్మానందం, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్.. అనేకమంది స్టార్స్ వచ్చారు.

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడిన అనంతరం రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇంత వరకు నేను తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏఎం రత్నం గారి వల్లే నా సినిమాలన్నీ ఇక్కడకు వచ్చాయి. ఇక్కడ నన్ను చాలా బాగా ఆదరించారు. ఇక్కడి ఆడియెన్స్ కోసం ఒక తెలుగు సినిమాను చేయాలని అనుకున్నాను. అందుకోసమే గేమ్ ఛేంజర్ చేస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఇంకో 15 రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. రామ్ చరణ్‌ది ఎక్స్‌లెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా? అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది అని అన్నారు.

Also Read : Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. ఆ నమ్మకంతోనే..

కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్ ముందు, భారతీయుడు 2 ఈవెంట్లో రామ్ చరణ్ గురించి డైరెక్టర్ శంకర్ మాట్లాడటంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.