Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. ఆ నమ్మకంతోనే..
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకట్లేదు.

Prabhas Aunt Shyamala Devi Comments on Prabhas Marriage
Prabhas Marriage : ప్రభాస్ ఎంత పెద్ద సినిమాలు తీసినా అందరికి సినిమాల కంటే కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నే అడగలనిపిస్తుంది. 40 ఏళ్ళు దాటినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోడంతో తమ అభిమాన హీరోకి పెళ్లి ఎప్పుడు అవుతుందా? లేక సల్మాన్ లాగా చేసుకోకుండా ఉండిపోతాడా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ కి సంబంధించి అన్ని విషయంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక్క పెళ్లి విషయంలో తప్ప.
Also Read : Darling Trailer : ‘డార్లింగ్’ ట్రైలర్ రిలీజ్.. పెళ్లి చేసుకొని భార్యతో ప్రియదర్శి కష్టాలు చూడండి..
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకట్లేదు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్ ని చూస్తే తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి విజయాలు దక్కవని పలువురు అన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ స్థాయి ఏంటో అందరికి తెలుసు. ప్రభాస్ తన సినిమాలు ప్రేక్షకులకు నచ్చడానికి చాలా కష్టపడుతున్నాడు. పెళ్లి కూడా అంతే. ప్రభాస్ కి పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని మేము కూడా చూస్తున్నాం. పై నుంచి కృష్ణం రాజు గారు అన్ని విషయాలు చూసుకుంటారు. ప్రభాస్ లైఫ్ లో అన్ని ఆయన ఆశించినట్టు జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుంది అని అన్నారు. మరి ప్రభాస్ కి ఆ పెళ్లి సమయం ఎప్పుడొస్తుందో చూడాలి.