Sathupally Tragedy : కొడుకు ఆత్మహత్యని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు అంత్యక్రియలు చేసిన చోటే రెండు రోజుల తేడాతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురి హృదయాలను కలిచివేసింది.

Sathupally Tragedy : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు అంత్యక్రియలు చేసిన చోటే రెండు రోజుల తేడాతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురి హృదయాలను కలిచివేసింది. జిల్లాలోని సత్తుపల్లికి చెందిన చల్ల భానుప్రకాష్ అనే విద్యార్ధి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో 10వతరగతి చదువుతున్నాడు. ఈనెల 14వ తేదీన స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు స్కూల్ లో జరుపుకున్నాడు.

ఈవిషయం తెలిసిన స్కూల్ యాజమాన్యం భాను‌ప్రకాష్‌ను  స్కూలు నుంచి వారం రోజలుపాటు సస్పెండ్ చేసింది.  భాను ప్రకాష్ సత్తుపల్లి  ఇంటికి  వచ్చాడు. స్కూల్ యాజమాన్యం తనను సస్పెండ్ చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ స్నేహితుడితో వీడియో కాల్ లో  మాట్లాడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి  పాల్పడ్డాడు.  ఆత్మహత్య చేసుకుని  అపస్మారక స్ధితిలోకి చేరిన భాను ప్రకాష్ ను  గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కొసం హైదరాబాద్ తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16న భానుప్రకాష్ మరణించాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తల్లితండ్రులు  అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం భానుప్రకాష్ తండ్రి రాంబాబు శనివారం  రాత్రి 11 గంటల సమయంలో ఇంటినుంచి  వెళ్లాడు.  రాత్రి  ఎంతసేపటికి   తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు.
Also Read : Omicron Fear : అమెరికా, యూకేలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
ఈరోజు ఉదయం కుమారుడిని ఖననం చేసిన  ప్రదేశానికి దగ్గరలోనే ఒక చెట్టుకు ఆత్మహత్యచేసుకున్న రాంబాబు   విగతజీవిగా కనిపించాడు. దీంతో గ్రామంలో   విషాదఛాయలు అలునుకున్నాయి. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి ఘటనపై కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం అకారణంగా శిక్షించటంతోటే  తమ కొడుకు ఆత్మహత్యచేసుకున్నాడని….కొడుకు మృతిని   తట్టుకోలేకే తన భర్త   ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి భార్య ఆరోపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు