Andaman and Nicobar Islands: మహిళపై సామూహిక అత్యాచారం.. అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీటు దాఖలు

ఈ కేసులో సిట్ అధికారులు తాజాగా 935 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 90 మంది వరకు సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్, సైంటిఫిక్, బయోలాజికల్ ఆధారాలను కూడా సిట్ అధికారులు చార్జిషీటులో పొందుపరిచారు.

Andaman and Nicobar Islands: మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై అండమాన్-నికోబార్ దీవుల మాజీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర జైన్‌తోపాటు మరో ముగ్గురిపై విచారణ కొనసాగుతోంది. సిట్ (ప్రత్యేక విచారణ బృందం) ఆధ్వర్యంలో ఈ కేసుపై జరుగుతున్న విచారణ తుది దశకు చేరుకుంది.

China apps: చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్, 94 రుణ యాప్ ల‌ను నిషేధించ‌నున్న కేంద్రం

ఈ కేసులో సిట్ అధికారులు తాజాగా 935 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 90 మంది వరకు సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్, సైంటిఫిక్, బయోలాజికల్ ఆధారాలను కూడా సిట్ అధికారులు చార్జిషీటులో పొందుపరిచారు. నిందితులకు వ్యతిరేకంగా కీలకమైన ఆధారాల్ని అధికారులు జతచేశారు. ఈ కేసులో జితేంద్ర జైన్‌తోపాటు మాజీ లేబర్ కమిషనర్ రిషి రాజ్, మరో ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ అత్యాచార కేసు గత ఏడాది అక్టోబర్‌లో నమోదైంది. మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Haath se haath Jodo: తెలంగాణ‌లో 2 నెల‌ల పాటు ‘హాథ్ సే హాథ్ జోడో’ కార్య‌క్ర‌మం.. రేపు మేడారంలో..

మహిళ ఫిర్యాదు ప్రకారం.. అప్పట్లో 21 సంవత్సరాల ఒక యువతి ఉద్యోగం కోసం వెతుకుతోంది. అదే సమయంలో ఆమెకు తెలిసిన ఒక హోటల్ అధినేత ఆమెను రిషి రాజ్‌కు పరిచయం చేశాడు. అతడు ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆల్కహాల్ తాగమని ఇచ్చాడు. దీనికి ఆమె నిరాకరించింది. తాను చెప్పినట్లు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక చర్యకు పాల్పడ్డాడు. రిషి రాజ్‌తోపాటు మరో ఇద్దరు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు దీనికి నిరాకరించింది. దీంతో పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను కోర్టు సిట్‌కు అప్పగించింది. సిట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు