Gujarat : బాలికపై గ్యాంగ్ రేప్..9మంది అరెస్ట్

 స్నేహితుడేనని నమ్మి వెళ్లినందుకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాలుడు.

Gujarat : స్నేహితుడేనని నమ్మి వెళ్లినందుకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాలుడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులకు కూడా ఆ బాలికను అప్పగించాడు. అంతేకాకుండా బాలికపై అత్యాచార ఘటనను వీడియో తీసి సోషల్​ మీడియోలో షేర్​ చేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్​ లో జరిగింది. రెండు నెలల క్రితం జరిగిన ఈ అమానుష ఘటన..ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన తొమ్మిది మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

గుజరాత్​ లోని డాంగ్​ జిల్లాలోని అహ్వా తాలుకాలో రెండు నెలల క్రితం 14 ఏళ్ల బాలిక పక్క ఊరిలో ఓ వివాహానికి హాజరైంది. అయితే బాలికను తిరిగి ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికిన మైనర్​ స్నేహితుడు.. వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వచ్చే దారిలో ఉన్న బాలుడి ఎనిమిది మంది స్నేహితులు బాలికను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను బాధితురాలి బంధువు చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయగా విషయం బయటకు వచ్చింది. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు 20 ఏళ్లవారు కాగా.. ముగ్గురు మైనర్లు అని పోలీస్ ఇన్స్ పెక్టర్ ఎన్​హెచ్​ సవ్సేత ఆదివారం తెలిపారు. ముగ్గురు మైనర్లు వారి సంరక్షకుల హామీతో బెయిల్​ పొందారని, మిగిలిన ఆరుగురిని కోర్టు ఆదేశాల మేరకు పోలీస్​ కస్టడీకి తరలించినట్లు చెప్పారు.

అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ముందు బాలికను బెదిరించారని ఎస్సై తెలిపారు. భయపడిపోయిన బాలిక రెండు నెలల వరకు ఎవరికీ చెప్పలేదని, ఇటీవల ఆమె బంధువు ఒకరు ఆ వీడియోను చూసి కుటుంబ సభ్యులకు తెలిపాడని, ఆ తర్వాత వారు పోలీసులను ఆశ్రయించగా డిసెంబర్​ 23న ఎఫ్​ఐఆర్​ నమోదైనట్లుతెలిపారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ALSO READ Fake Currency Gang : నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్-రూ.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు