Himachal Pradesh Polls: 412 మంది అభ్యర్థుల్లో 226 మంది కోటీశ్వరులే

వీరు కేవలం కోటీశ్వరులే కాకుండా.. ఇందులో కొంత మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తెలిపింది. కాగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 35 మంది కోటీశ్వరులు ఉన్నారు

Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి అన్ని పార్టీల నుంచి 412 మంది పోటీ పడుతున్నారు. అయితే ఇందులో సగానికి పైగా కోటీశ్వరులే ఉన్నారట. మొత్తంగా 226 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ఎన్నికల అఫిడవిట్ స్పష్టం చేస్తోంది. ఇందులో 61 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, 56 మంది అధికార భారతీయ జనతా పార్టీకి చెందినవారు ఉండడం గమనార్హం.

అయితే వీరు కేవలం కోటీశ్వరులే కాకుండా.. ఇందులో కొంత మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తెలిపింది. కాగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 35 మంది కోటీశ్వరులు ఉన్నారు. నాలుగవ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. ఆ పార్టీకి చెందిన 25 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరిలో కొందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరంతా పోగా.. 45 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం కోటీశ్వరులు.

హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటిసారి బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్ మధ్య త్రిముఖపోరు నెలకొంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐఎం నుంచి 11 మంది, సీపీఐ ఒక్కరు, బీఎస్పీ నుంచి 53 మంది, ఆర్డీపీ నుంచి 29 మంది అభ్యర్థులు అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచారు. సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత జై రామ్ ఠాకూర్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి చేత్రమ్ ఠాకూర్, ఆప్ నుంచి గీతా నంద్ ఠాకూర్ లు బరిలో నిలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో బిజెపి గెలుచుకోగా, 21 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈసారి ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రానుందని అంచనాలు వస్తున్నాయి.

PM Modi In Telangana : నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలిసిపోను : ప్రధాని మోడీ

ట్రెండింగ్ వార్తలు