Types Of Cow Feed : అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు..

తక్కువ నీటిలో సాగుచేయదగిన , అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి.

Types Of Cow Feed : పశుపోషణలో పశుగ్రాసాలు ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితోపాటు మేపుపై కూడా 60 శాతం ఆధారపడి ఉంటుంది.

జన్యువేకాక, అధికపాల ఉత్పాదక శక్తి సామర్ధ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటిలో సాగుచేయదగిన , అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన యువత సైతం పశువులు, జీవాల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఈ రంగంలో రాణించాలంటే రైతులు ముందుగా పశుగ్రాసాల సాగుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మేలైన పశుగ్రాసాల సాగుతోనే అధిక పాల దిగుబడి, మాంసం ఉత్పత్తి లభిస్తాయి.

పాడి పశువులు, జీవాల నిర్వహణలో సింహభాగం ఖర్చు మేతకే వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి, ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు అందించే గ్రాసాలను ఎంపిక చేసి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ గ్రాసాలు అధిక దిగుబడినిస్తాయి వాటి సాగులో పాటించాల్సిన మెలకువలు ఏమిటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాసం విభాగ ప్రధాన శాస్త్రవేత్త శశికళ.

పశుపోషణ, జీవాల పెంపకం చేపట్టే వారు ఎక్కువగా దాణాలపై ఆధారపడకుండా పచ్చిమేతలను అందించినపుడే..పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. అలా అని ఒకే రకం మేతలను అందిస్తే అంత ఇష్టంగా తినవు. అందువల్ల కాలానుగుణంగా గ్రాసాల పెంపకం చేపట్టాలి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు