IPL 2024 Prize Money : ఐపీఎల్ విజేత‌కు ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

ఐపీఎల్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ ల‌భిస్తుంది.

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నేడు (ఆదివారం మే 26) చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ రెండు జ‌ట్ల‌లో ఓ జ‌ట్టు విజేత‌గా నిల‌నుంది. మ‌రీ ఐపీఎల్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ ల‌భిస్తుంది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంతిస్తారు? అన్న విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

విజేత‌కు ఎంతంటే..?
17వ సీజ‌న్‌లో బీసీసీఐ మొత్తం 46.5 కోట్ల రూపాయాల‌ను ప్రైజ్‌మ‌నీగా ప్ర‌క‌టించింది. ఇందులో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు రూ.20 కోట్లు ల‌భిస్తుంది. అటు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు రూ.13 కోట్లు ద‌క్క‌నున్నాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన జ‌ట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జ‌ట్టుకు రూ.6.5కోట్లు ల‌భిస్తాయి.

Michael Vaughan : పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్‌.. పాక్‌తో సిరీస్‌ కంటే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్ ఆడాల్సింది

ప‌ర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ విజేత‌ల‌కు ఎంతంటే.?

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతల‌కు చెరో రూ.15లక్ష‌లు ఇవ్వ‌నున్నారు. 14 మ్యాచుల్లో 741 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్‌ను అందుకోనున్నాడు. కోల్‌క‌తా, హైద‌రాబాద్ జ‌ట్ల‌లో ఎవ్వ‌రూ కూడా కోహ్లి ద‌రిదాపుల్లో లేరు. ఒక్క ట్రావిస్ హెడ్ 561 ప‌రుగుల‌తో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో అత‌డు కోహ్లిని దాట‌డం అసాధ్యం.

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రూ. 20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడికి 12 లక్షలు ఇవ్వ‌నున్నారు.

Shakib Al Hasan : 14 వేల ప‌రుగులు, 700 వికెట్లు.. క్రికెట్ చ‌రిత్ర‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఒకే ఒక్క‌డు..

ట్రెండింగ్ వార్తలు