Michael Vaughan : పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్‌.. పాక్‌తో సిరీస్‌ కంటే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్ ఆడాల్సింది

ఈ సిరీస్ వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఆట‌గాళ్ల‌కు మంచి ప్రాక్టీస్ ల‌భిస్తుంద‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది.

Michael Vaughan : పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్‌.. పాక్‌తో సిరీస్‌ కంటే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్ ఆడాల్సింది

Playing in IPL is better than playing against Pakistan says Vaughan

మ‌రో వారం రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ముందు స‌న్నాహ‌కంగా ఇంగ్లాండ్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఇంగ్లాండ్ వేదిక‌గా నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్ వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఆట‌గాళ్ల‌కు మంచి ప్రాక్టీస్ ల‌భిస్తుంద‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది.

అందుక‌నే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన ఆట‌గాళ్ల‌ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడ‌కుండా అడ్డుకుంది. పొట్టి క‌ప్పుకు ఎంపికైన ఆట‌గాళ్లు ఆట‌గాళ్లంద‌రూ పాకిస్తాన్‌తో సిరీస్‌లో ఆడాల‌ని ఆదేశించింది. దీంతో జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌), విల్‌ జాక్స్ (ఆర్‌సీబీ), ఫిల్‌ సాల్ట్‌ (కేకేఆర్‌) ల‌తో పాటు మ‌రికొంద‌రు ఆట‌గాళ్లు ప్లే ఆఫ్స్‌కు ముందే ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.

Rahul Tripathi : అది చాలా క్లిష్టసమయం.. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ త్రిపాఠి వ్యాఖ్య‌లు..

ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ ఈసీబీ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టాడు. పాకిస్తాన్ ప‌రువు పోయేలా వ్యాఖ్య‌లు చేశాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాక్‌ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడ‌డం కంటే ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆడి ఉంటేనే ఇంగ్లాండ్‌కు మంచి జ‌రిగి ఉండేద‌ని అభిప్రాయపడ్డాడు.

ఎంతో ఒత్తిడి, భారీ జ‌న‌సందోహం, విప‌రీత‌మైన అంచ‌నాల మ‌ధ్య జ‌రిగే ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచుల్లో ఆడి ఉంటే బట్లర్‌, జాక్స్‌, సాల్ట్‌లకు ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌నీ చెబుతూనే బ‌ట్ల‌ర్ కాక‌పోయినా విల్ జాక్స్‌, ఫిల్ సాల్ట్ వంటి యువ ఆట‌గాళ్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడాల్సి ఉండాల్సింది అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.

Pat Cummins : ఐపీఎల్ ఫైన‌ల్‌కు ముందు.. ధోనీ సిక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూస్తున్న క‌మిన్స్‌..

వాన్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

పాకిస్తాన్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య నాలుగు టీ20 మ్యాచుల సిరీస్ జ‌రుగుతోంది. మొద‌టి టీ20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. శ‌నివారం జ‌రిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మూడో టీ20 మే 28, నాలుగో టీ20 30 తేదీల్లో జరుగనున్నాయి.