Shakib Al Hasan : 14 వేల ప‌రుగులు, 700 వికెట్లు.. క్రికెట్ చ‌రిత్ర‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఒకే ఒక్క‌డు..

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్‌ అల్‌ హసన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Shakib Al Hasan : 14 వేల ప‌రుగులు, 700 వికెట్లు.. క్రికెట్ చ‌రిత్ర‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఒకే ఒక్క‌డు..

Shakib creates history only international cricketer to score 14000 runs and take 700 wickets

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్‌ అల్‌ హసన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (అన్ని పార్మాట్ల‌లో) 14000 పరుగులు చేయడంతో పాటు 700 వికెట్లు పడగొట్టిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. శ‌నివారం అమెరికాతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా బ్యాట‌ర్ ఆండ్రియ‌స్ గౌస్ ను ఔట్ చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ష‌కీబ్‌కు ఇది 700 వికెట్ కావ‌డం విశేషం.

బంగ్లాదేశ్ త‌రుపున ష‌కీబ్ 67 టెస్టులు, 247 వ‌న్డేలు, 122 టీ20 మ్యాచులు ఆడాడు. వ‌న్డేల్లో 7570 ప‌రుగులు చేయ‌డంతో పాటు 317 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే టెస్టుల్లో 4505 ప‌రుగులు చేయ‌డంతో పాటు 237 వికెట్లు తీశాడు. టీ20ల్లో 2440 ప‌రుగులు చేయ‌డంతో పాటు 146 వికెట్లు సాధించాడు.

IPL 2024 : ఐపీఎల్ ముగింపు వేడుక‌లు.. ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ క‌చేరీ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో అమెరికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 104 ప‌రుగులు చేసింది. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆరు వికెట్ల‌తో చెల‌రేగాడు. ఈ స్వ‌ల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 11.4 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. బంగ్లా ఓపెన‌ర్లు తాంజిద్ హసన్ (42 బంతుల్లో 58నాటౌట్‌), సౌమ్య స‌ర్కార్ (28 బంతుల్లో 43 నాటౌట్‌) దంచికొట్టారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచిన‌ప్ప‌టికీ మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 2-1తో కోల్పోయింది.