Namo : సర్వైవల్ కామెడీ సినిమా ‘నమో’.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

తాజాగా నమో సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Namo : విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘నమో’. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ప్రశాంత్ నిర్మాణంలో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ నమో సినిమాని తెరకెక్కించారు. సర్వైవల్ కామెడీ జానర్‌లో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘నమో’ సినిమా రాబోతోంది.

Also Read : Kalki 2898AD : హమ్మయ్య.. ఇప్పటికి కల్కి షూటింగ్ పూర్తయింది.. మూవీ యూనిట్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?

గతంలో ఆల్రెడీ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. తాజాగా నమో సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నమో సినిమా జూన్ 7న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

జింకలను వేటాడటం చట్టరీత్య నేరం అని, ఎవరైనా వేటాడితే ఉరిశిక్ష అని ప్రభుత్వం చెప్పడంతో అడవిలో జింకల్ని వేటాడే ఓ బ్యాచ్ భయపడుతుంది. ఆ బ్యాచ్ జింకల్ని పట్టుకోవడం హీరోలు ఇద్దరు చూడటంతో వాళ్ళని బంధిస్తారు. వాళ్ళ దగ్గర్నుంచి ఎలా తప్పించుకున్నారు అనే కథాంశంతో నమో సినిమాని కామెడీగా తెరకెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు