ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం: కలెక్టర్ దాసరి హరి చందన

Graduates MLC bye election: ఓటర్లకు అవగాహన కోసం బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని దాసరి హరి చందన తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై 10టీవీతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడారు.

ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.

ఎన్నికల్లో జంభో బ్యాలెట్ కావడంతో ఓటర్లు అవగాహన కోసం బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని దాసరి హరి చందన తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటరు తమ ఓటును రాయాలని చెప్పారు. ప్రాధాన్య క్రమం తప్పకుండా.. రిపీట్ కాకుండా నెంబర్లు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

నెంబర్ కాకుండా ఇతర ఏ విధంగా రాసినా ఓటు చెల్లదని చెప్పారు. విధుల్లో ఉండే అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాలెట్ పేపర్లు తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్, ఎస్కార్ట్ పెట్టామని అన్నారు. పోలింగ్ ముగిసిన 12 జిల్లాల నుంచి వెంటనే నల్లగొండ కేంద్రంలో ఉన్న కౌంటింగ్ కేంద్రానికి తరలించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

ట్రెండింగ్ వార్తలు