బీజేపీలో కల్వకుంట్ల కవితను చేర్చుకుంటారా? ఎంపీ అర్వింద్ సమాధానం ఇదే..
"తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందని నేను అనుకోవడం లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే" అని అన్నారు.

Dharmapuri Arvind
Dharmapuri Arvind: బీజేపీలోకి కల్వకుంట్ల కవితను చేర్చుకుంటారా? తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా? వంటి ప్రశ్నలపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇవాళ “10టీవీ వీకెండ్ విత్ అర్వింద్” ప్రోగ్రాంలో అర్వింద్ మాట్లాడారు.
“అన్నిటికీ పరిష్కారం సమయమే చెబుతుంది. నాకు తెలిసి మా పార్టీలో కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవ్వరిని కూడా తీసుకోము. చేర్చుకునే ఆలోచన వస్తుందని కూడా నేను అనుకోను.
కవిత, రేవంత్ రెడ్డి కలిసి పలు కంపెనీలలో పార్ట్‌నర్‌గా ఉన్నారు. తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందని నేను అనుకోవడం లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే” అని అన్నారు. (Dharmapuri Arvind)
Also Read: కవిత జైల్లోకి వెళ్తే మేము పంపినట్లు, బయటకు వస్తే మేమే తీసుకొచ్చినట్లా?: బీజేపీ ఎంపీ అర్వింద్
ఈటల రాజేందర్ ఇటీవల “హిందుత్వం కాదు మా నినాదం.. అభివృద్ధి మా నినాదం” అని అన్నారు. బండి సంజయ్ మాత్రం హిందుత్వం తమ నినాదమని చెప్పారు. దీనిపై అర్వింద్ మాట్లాడుతూ.. “ఈటల రాజేందర్ రాష్ట్రంలో ఓ గౌరవనీయ పొలిటికల్ ఫిగర్. హిందుత్వము, జాతీయత భావం, అభివృద్ధిలో దేన్నీ తక్కువ చేయలేము..
ఎక్కువ చేయలేము. హిందూ, నేషనలిజం, అడ్మినిస్ట్రేషన్ ఏది ఫస్ట్ కాదు.. ఏది లాస్ట్ కాదు.. ఇందులో అన్నీ ఇంపార్టెంట్” అని తెలిపారు. భారత్‌లో హిందువులు 80% మంది ఉన్నారు కాబట్టే ఈ దేశము ప్రశాంతంగా ఉందని, అభివృద్ధి చెందుతోందని చెప్పారు.