Telangana : వైద్యంకోసం యువతి వెళ్తే.. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. దారుణం..

Telangana : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

Telangana : వైద్యంకోసం యువతి వెళ్తే.. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. దారుణం..

Sexual assault (Google Image)

Updated On : September 8, 2025 / 10:02 AM IST

Telangana : తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఆస్పత్రికి చెందిన టెక్నీషియన్ యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: మూడో భార్య చేతిలో భర్త హత్య.. బావిలో మృతదేహం.. రెండో భార్య గుర్తించి..

కరీంనగర్ జిల్లాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చిన యువతిపై ఆస్పత్రి టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. దీంతో కరీంనగర్ సిటీలోని దీపిక ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అదే ఆస్పత్రిలో మహారాష్ట్రకు చెందిన దక్షిణా మూర్తి (24) టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.

ఆదివారం తెల్లవారు జామున ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి వద్దకు వెళ్లిన దక్షిణా మూర్తి.. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తరువాత యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తు నుంచి తేరుకున్న తరువాత ఆ యువతి జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

యువతిపై లైంగిక దాడి జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. పుటేజీ ఆధారంగా దక్షిణా మూర్తి ఆస్పత్రికి వైద్యంకోసం వచ్చిన యువతిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.