పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం జరగనుంది?
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎంతో ఆయా ఎమ్మెల్యేలు చర్చించారు.

Cm Revanth Reddy
CM Revanth Reddy: బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కడియం శ్రీహరి మినహా రేవంత్ రెడ్డితో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సమావేశం అయ్యామని ఆయా ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎంతో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చర్చించారు.
Also Read: కవిత జైల్లోకి వెళ్తే మేము పంపినట్లు, బయటకు వస్తే మేమే తీసుకొచ్చినట్లా?: బీజేపీ ఎంపీ అర్వింద్
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. (CM Revanth Reddy)
స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొందరు రిప్లై ఇవ్వగా… మిగతా వారు వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో ఆయా ఎమ్మెల్యేలు విడివిడిగా భేటీ అయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గొడవలు, నేతల మధ్య విభేదాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ నేతల మధ్య విభేదాల పరిష్కారం భాధ్యతను పీసీసీ చీఫ్ కు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.