Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.

Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, కాప్రా, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలో ఓ మోస్తరు వర్షం పడుతోంది.

తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, నాచారం, మల్లాపూర్ హబ్సిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కుురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. హయత్ నగర్ ప్రాంతంలో గాలికి గుడిసెలు ఎగిరిపోయాయి.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎండ ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎండాకాలం ముగియక ముందే వర్షాలు పడుతుండడం గమనార్హం. ఈ సారి నైరుతి రుతుపవనాలు కూడా త్వరగానే వస్తున్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Rajkot Fire : గుజరాత్ రాజ్‌కోట్ అగ్నిప్రమాద ఘటనలో 33కు చేరిన మృతుల సంఖ్య