Kalki 2898AD : హమ్మయ్య.. ఇప్పటికి కల్కి షూటింగ్ పూర్తయింది.. మూవీ యూనిట్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?

కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకో నెల రోజులు టైం ఉన్నా ఇంకా షూటింగ్ అవ్వలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.

Kalki 2898AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, బుజ్జి వెహికల్ వీడియోలతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లాంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇటీవలే బుజ్జి వెహికల లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.

కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకో నెల రోజులు టైం ఉన్నా ఇంకా షూటింగ్ అవ్వలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా కల్కి షూటింగ్ పూర్తయిందని సమాచారం. కల్కి సినిమాకు పనిచేసిన పలువురు సాంకేతిక సిబ్బంది షూట్ పూర్తయిందని తమ సోషల్ మీడియాలలో తెలిపారు. కల్కి షూట్ పూర్తయినందుకు మూవీ యూనిట్ ఇచ్చిన గిఫ్ట్స్ ఫోటోలు తీసి పోస్ట్ చేశారు.

Also Read : Vishwak Sen : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య బాబు.. విశ్వక్ కోసం వస్తున్న నందమూరి హీరోలు..

మూడేళ్ళుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్న సాంకేతిక సిబ్బందికి గిఫ్ట్స్ ఇచ్చింది కల్కి మూవీ యూనిట్. ఈ గిఫ్ట్స్ లో నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ వేసిన సరదా టీ షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్, ప్రేమతో నిర్మాణ సంస్థ నుంచి రాసిన ఒక లెటర్, కల్కి బ్యాడ్జ్ ఒకటి ఇచ్చారు. వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కల్కి షూటింగ్ పూర్తవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులు.

ఇన్ని రోజులు ఇంకా షూటింగ్ అవ్వలేదు అనడంతో మళ్ళీ వాయిదా పడుతుందా, చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారా అని సందేహించారు అభిమానులు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని, కొన్ని సీన్స్ ఉంటే నిన్నటితో షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. దీంతో పక్కాగా జూన్ 27న కల్కి సినిమా రిలీజయి భారీ విజయం సాధిస్తుందని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

ట్రెండింగ్ వార్తలు