Vishwak Sen : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య బాబు.. విశ్వక్ కోసం వస్తున్న నందమూరి హీరోలు..

బాలయ్య బాబుని తన సినిమా ప్రమోషన్ కి వాడుతున్నాడు విశ్వక్.

Vishwak Sen : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య బాబు.. విశ్వక్ కోసం వస్తున్న నందమూరి హీరోలు..

Balakrishna will be a guest at Vishwak Sen's Gangs of Godavari movie Pre Rrelease Event

Vishwak Sen – NTR – Balakrishna  : విశ్వక్ సేన్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దాస్ కా ధమ్కీ, గామి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటీకే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఊర మాస్ సినిమాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రాబోతుంది. అయితే విశ్వక్ ముందు నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ ఎన్టీఆర్ అభిమానులని కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు.

ఎన్టీఆర్ సినిమాల గురించి పోస్టులు పెడతాడు, ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడతాడు విశ్వక్. దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సందడి చేసాడు. ఎన్టీఆర్ విశ్వక్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ నా తమ్ముడు అని కూడా దగ్గరికి తీసుకొని మరీ మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. విశ్వక్ ఎన్టీఆర్ తో పాటు బాలయ్య బాబుకి కూడా క్లోజ్. అన్ స్టాపబుల్ ప్రోగ్రాం నుంచి బాలయ్యకు దగ్గరయ్యాడు విశ్వక్. అప్పుడప్పుడు వీళ్ళు బయట కలుస్తారని కూడా చెప్పాడు. ఆల్రెడీ దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలయ్య బాబు వచ్చారు.

Also Read : Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య బాబు..

ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుని తన సినిమా ప్రమోషన్ కి వాడుతున్నాడు. దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే ఇప్పుడు రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు బాలకృష్ణ గెస్ట్ గా రానున్నారు. ఈ విషయాన్ని విశ్వక్ స్వయంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తెలిపాడు. మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు బాలయ్య బాబు విశ్వక్ సినిమాల కోసం రిపీట్ గా వస్తుండటంతో ఇటు విశ్వక్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 28న చేయబోతున్నట్టు సమాచారం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.