Ek Din : ఆమిర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ (Ek Din) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఏక్ దిన్.
Sai Pallavi first bollywood movie Ek Din Trailer our now
Ek Din : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఏక్ దిన్. సునీల్ పాండే దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాయి పల్లవి కథానాయిక. ఈ చిత్రంతోనే అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. జునైద్‌ఖాన్, సాయి పల్లవిలు.. రోహన్, మీరా పాత్రల్లో కనిపించనున్నారు. మీరాను ఇష్టపడిన రోహన్ తన మనసులోని మాట చెప్పేందుకు భయపడుతుంటాడు. కానీ ఒక్క రోజు అయిన ఆమెతో కలిసి ప్రయాణం చేయాలనుకున్న అతడి కోరిక నెరవేరిందా ? అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా అర్థమవుతోంది.
