Israeli Missile Strikes Damascus: సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. 15మంది మృతి

సిరియా రాజధాని డమాస్కస్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో స్థానిక పౌరులతో సహా 15 మంది మరణించినట్లు సిరియా మీడియా వెల్లడించింది.

Israeli Missile Strikes Damascus : సిరియా రాజధాని డమాస్కస్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో స్థానిక పౌరులతో సహా 15 మంది మరణించినట్లు సిరియా మీడియా వెల్లడించింది. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ క్షిపణుల దాడి జరిగినట్లు తెలిపింది. సిరియా రాజధానిలో కాఫర్ సౌసా పరిసరాల్లోని భవనాలకు ఈ దాడివల్ల భారీ నష్టం జరిగింది. మృతుల్లో ఎక్కువగా సామాన్య పౌరులు ఉన్నారు.

Israel Attacks Syria Airbase : సిరియా మిలిటరీ ఎయిర్ బేస్‌పై మిసైల్స్‌తో ఇజ్రాయెల్ దాడి

అయితే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుండి ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. 15మంది మరణించడంతో పాటు పదుల సంఖ్యలో స్థానిక పౌరులకు తీవ్ర గాయాలైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక ఆస్పత్రులకు వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ క్షిపణిదాడిలో పలు భవనాలు నేలకూలాయి. కాఫర్ సౌసాలోని అనేక నివాస భవనాలు నేలకూడంలో భారీ నష్టం వాటిల్లింది.

 

గత శుక్రవారం సిరియాలో జరిగిన దాడిలో సుమారు 53 మంది మరణించారు. వీరిలో 46 మంది పౌరులు కాగా, ఏడుగురు సైనికులు ఉన్నారు. ఈ దాడికి ఐసిస్ బాధ్యత వహించింది. గత ఏడాది కాలంలో జీహాదీలు జరిపిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు