EarthQuake in Japan: జపాన్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు

జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను రిక్టార్ స్కేల్‌పై 7.3గా లెక్కించారు. ఈశాన్య తీరంలో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు..

EarthQuake in Japan: జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను రిక్టార్ స్కేల్‌పై 7.3గా లెక్కించారు. ఈశాన్య తీరంలో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం ఫుకుషిమా ప్రాంతంలో 60 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.

రాత్రి 11గంటల 36 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8.06గంటల) తీరంలోని కొన్ని ప్రాంతాలకు ఒక మీటరు సునామీ అలల హెచ్చరిక జారీ చేశారు. ఈ భూకంపం వల్ల నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. రాజధాని టోక్యోను కదిలించిన భూ ప్రకంపనలతో.. టోక్యోలో మిలియన్లకు పైగా గృహాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

11ఏళ్ల క్రితం రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి సునామీకి కారణమైన ప్రాంతంలోనే ఈసారి భూమి కంపించింది. మార్చి 11, 2011న తూర్పు తీరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం, సునామీ తర్వాత 11 సంవత్సరాల క్రితం కరిగిపోయిన ఫుకుషిమా అణు కర్మాగారంలో కార్యకలాపాలను తనిఖీ చేస్తున్నట్లు TEPCO ఒక ట్వీట్‌లో పేర్కొంది.

Read Also : జైపూర్‌లో స్వల్ప భూకంపం.. తీవ్రత 3.8గా నమోదు.. భయాందోళనలో స్థానికులు..

భూ ప్రకంపనల కారణంగా దాదాపు 20 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. టోక్యో నగరంలో 7లక్షల ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు