Sunflower : సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వు వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ..!

ప్రేమ ప్రకృతి వేరు వేరు కాదు. ప్రకృతి ఎంతో ప్రేమతో మనిషికి ఎన్నో వనరుల్ని ఇచ్చింది. పంచభూతాలు ఈ ప్రకృతిలో భాగమే. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. అటువంటి బంధంలో ప్రేమే ఉంటుంది. అటువంటి అందమైన ప్రకృతిలో భాగమైన పొద్దుతిరుగుడు పువ్వు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పువ్వు ఆవిర్బావంలోనే ప్రేమ ఉంది. పొద్దు తిరుగుడు పువ్వు వెనుక ఆసక్తికరమైన ప్రేమ కథ ఇది..

Sunflower Sun Direction Love story

Sunflower Sun Direction : పొద్దు తిరుగుడు పువ్వు. పసుపు పచ్చని రంగులో కనిపించే అందమైన పువ్వు. బంతిజాతికి చెందిన ఈ పొద్దు తిరుగుడు పువ్వుని సూర్యకాంత పుష్పం అనికూడా అంటారు. పొద్దు ఎటు తిరిగితే అటు తిరగడం వల్ల దీనిని పొద్దుతిరుగుడు పువ్వు అని పిలుస్తారు.పువ్వు జాతుల్లో ఏ పువ్వుకు లేని ప్రత్యేకత ఈ పువ్వుకు ఉంది. సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరటం ఈ పువ్వు(Sunflower Sun Direction )కు ఉన్న ప్రత్యేకత. మరి ఈ పువ్వు నిజంగానే సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందా..?అంటే నిజమేనని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి ఈ పువ్వు ఎందుకు అలా తిరుగుతుంది? దీనికి కారణాలేంటి..? అనే విషయాలు చాలా ఆసక్తిని కలిస్తాయి.

ఈ పువ్వు సూర్యుడి ఎటు తిరగితే అటు తిరటం వెనుక ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ (triangle Love story)ఉందట. గ్రీకు కథలో ఉందీ లవ్ స్టోరీ. మరి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో హీరో,హీరోయిన్లు ఎవరు..? లవ్ స్టోరీలో భగ్నప్రేమకు ఫలితంగా ఏర్పడిన పువ్వు ఆసక్తికర కథలోకి వెళ్లిపోదాం రండి..

12 Lakhs Sunflowers Gift To wife : 50 పెళ్లిరోజు గిఫ్టుగా భార్యకు 12 లక్షల సన్‌ఫ్లవర్స్.. అంబరాన్ని అంటిన ఆమె ఆనందం

పొద్దు తిరుగుడు పువ్వు..గ్రీకుల కథ..
సూర్య భగవానుడిని గ్రీకులు అపోలోగా భావిస్తారు. శక్తికి, జీవానికి, కాలానికి ఆయన ప్రతీకగా భావిస్తారు. అద్భత సౌందర్యాన్ని కలిగి ఉండే సూర్యుడుని గ్రీకులు చాలా ఇష్టపడతారు. గ్రీకు భాషలో అపోలో అంటే మ్యాన్లీ బ్యూటీ అని అర్థం. గ్రీకు పురాణాల్లో అపోలో ఒక దేవుడు. అతను మండుతున్న రథాన్ని ఆకాశంలో నడిపించేవాడని భావిస్తారు. అంటే సూర్య భగవానుడు. ఏడు గుర్రాలపై సూర్యుడు ఉదయం నుంచి సాయంత్ర వరకు ప్రయాణిస్తాడు. అతని గమనం వల్లే పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. బంగారు వన్నె కురులతో తేజోమయమైన కన్నులతో సూర్యుడు ఎంతో అందంగా ఉంటాడని ప్రకృతి మనుగడకు..జీవాల మనుగడకు ఆదిత్యుడు ఆద్యుడని భావిస్తారు. సూర్యగమనం వల్లే ఈ జీవకోటి మనుగడ సాగిస్తుందనేది నిజమని తెలిసిందే. సూర్యరశ్మి వల్లనే జీవాహారం లభిస్తోంది.

మరి అంత అందంగా ఉంటే అమ్మాయిలు కూడా ఇష్టపడతారు కదా..అలా తేజోమయంగా బంగారు వర్ణంలో మెరిసిపోయే సూర్యుడిపై క్లైటీ అనే వనదేవత మనసుపడింది. అమితంగా సూర్యుడిని ప్రేమించింది. కానీ సూర్యుడికి ఆమెను ప్రేమించలేదు. కారణం సూర్యుడు వేరే అమ్మాయిపై మనసు పడ్డాడు. ప్రేమించాడు. అందుకే క్లైంటీ ప్రేమను తిరస్కరించాడు. సూర్యుడు డఫ్నే అనే యువతిని ప్రేమించాడు. ఆమె జల దేవుని కుమార్తె. ఇక్కడే అసలైన ట్విస్టు..క్లైంటీ సూర్యుడిని ప్రేమించింది. కానీ సూర్యుడు డఫ్నేని ప్రేమించాడు. కానీ డఫ్నే మాత్రం సూర్యుని ప్రేమించలేదు. అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సూర్యుడు తనని ప్రేమించమని డఫ్నేను ఒత్తిడి చేసేవాడట..దీంతో ఆమె ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పిందట. అప్పుడు ఆ జలదేవుడు ఆమెను ఒక మొక్కగా మార్చేశాడట. దీంతో సూర్యుడు మనసు గాయపడింది. తను ప్రేమించిన అమ్మాయి మొక్కగా మారిపోవటంతో బాధపడిపోయాడట.

కానీ సూర్యుడిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన క్లైటీ తన ప్రేమ భగ్నం కావటంతో బెంగపెట్టుకుంది. ఉన్నచోటనే ఉంటూ తిండి తినకుండా నీరు తాగకుండా మానసికంగా కృంగిపోయిందట. అలా సూర్యుడు ఎప్పటికైనా తనను ప్రేమించకపోతాడా అని ఆశపడుతుండేది. ఎదురు చూస్తుండేంది. అలా ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు సూర్యుడిని చూస్తు ఆమె ఉన్నచోటనే ఉండి ఒక పువ్వుగా మారిపోయిందట. ఆ పువ్వే sunflower అని పిలిచే పొద్దుతిరుగుడు పువ్వు. ఇది గ్రీకు కథలో ఉన్న కథ..

కాగా..పురాణాల్లో ఎన్నో కథలు ఉంటాయనే విషయం తెలిసిందే. అటువంటి కథల్లో పొద్దుతిరుగుపువ్వు గురించి కూడా ఓ కథ ఇది. కథ అంటే కల్పితం అనుకోవచ్చు.. కానీ కల్పితమైనా నమ్మకమైన ఓ అందమైన పువ్వు వెనుక దాని ప్రక్రియ వెనుక కారణాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. అటువంటిదే ఈ కథ కూడా.

ఈ పువ్వు ఉదయం సూర్యుడు ఉదయించిన సమయంలో తూర్పు వైపుకు ఉంటుంది. రోజు గడిచేకొద్దీ పడమర వైపుకు అంటూ సూర్యుడు అస్తమించే దిక్కుకు మారుతుంది. బాగా గమనిస్తే, పొద్దుతిరుగుడు పువ్వులు శీతాకాలంలో కంటే వేసవిలో మరింత చురుకుగా ఉంటాయి. దీనికి కారణం సూర్యుడు. సూర్యకాంతి 6-7 గంటల కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పువ్వులు వికసిస్తాయి. పొద్దుతిరుగుడు పువ్వులు అధిక వేడిలో వేగంగా వికసిస్తాయి. అంతేకాదు వికసించిన కొన్ని రోజులు అయిన పొద్దుతిరుగుడు పువ్వుల కంటే కొత్తగా వికసించే పువ్వులు సూర్యుని దిశలో ఎక్కువగా కదులుతుంటాయి. అంటే దీనిని బట్టి గ్రీకు పురాణంలో క్లైంటీ కథకు దగ్గరగా ఉన్నట్లే ఉంది కదూ అని అనిపించేలా ఉంది.

ఇక ఈ పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునివైపే తిరగడానికి శాస్త్రీయ కారణం ఏంటో కూడా తెలుసుకుందాం..అసలైన కారణం ఆ మొక్కలో ఉండే ఫోటో హీలియో ట్రాపిజమ్ అనే చర్య. సూర్య రశ్మి వలనే మొక్కలు పెరుగుతాయని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలా పెరగటంతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించడమే ఫోటోట్రాఫిజమ్ కారణంగా ఉంది. ఈ మొక్కలో ఉన్న అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేటులు విచ్ఛిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది. పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉన్న ఆక్సిన్ హార్మోన్ వల్ల సూర్య రశ్మి వైపుకు పువ్వు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆక్సిన్ హార్మోను సూర్యరశ్మి పడని భాగం లో ఎక్కువగా ఉత్పత్తి ఔతుంది. పువ్వు సూర్యుని వైపు తిరిగి ఉన్నప్పుడు..ఆ పువ్వు వెనుకభాగంలో అంటే రక్షకపత్రాల కింద నీడలో (అంటే పువ్వు వెడల్పుగా ఉంటుంది కాబట్టి) ఆక్సిన్ ఉత్పత్తి ఔతుంది. దీంతో ఆభాగం వేగంగా పెరుగుతుంది. ఆ వేగమైన పెరుగుదల వల్ల పువ్వు కదులుతుందని అంటారు వృక్షశాస్త్ర నిపుణులు. నీడ ఉన్నచోటికి పువ్వు వెనుక భాగం తిరిగే ప్రక్రియలో సూర్యుని వైపుకి పువ్వు ముందుభాగం కదులుతుంది. అందుకే పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునికి అభిముఖంగా తిరుగుతుంటుంది.

కాగా సాధారణ మొక్కలు ఉండే ప్రాంతంలో కంటే పొద్దు తిరుగుడు(sun flower) మొక్కల నుండి ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తరి అవుతుంది. దానికి కారణం పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ సూర్యరశ్మిని(sun) తీసుకోవడం. పొద్దు తిరుగుడు పువ్వులో ఆక్సిడేషన్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. పొద్దు తిరుగుడు పువ్వు ఎక్కువ సూర్యరశ్మిని తీసుకొని తద్వారా మిగతా చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.

ప్రొద్దు తిరుగుడు పువ్వు మరిన్ని విశేషాలు..ఉపయోగాలు..
ప్రొద్దు తిరుగుడు పువ్వు బంతి జాతి మొక్కకు చెందినది.
ఫ్రాన్స్ రాజైన 14వ లూయీ ప్రొద్దుతిరుగుడు పువ్వును చిహ్నంగా పెట్టుకున్నాడు.అందుకే అతను సన్ కింగ్ అని పేరొందాడు.
సోయా బీన్స్, వేరుశనగ ఆముదపు గింజలలాగే ప్రొద్దుతిరుగుడు కూడా నూనె గింజ.ఈ గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ వెజిటబుల్ నూనెను మార్గరిన్‌లో ఉపయోగిస్తారు. దీనిని దీసెల్ నూనెకు బదులుగా వాడతారు. విత్తనాలను పగలగొట్టి నూనె తీయగా మిగిలిన పిప్పిని కొలిమిలోనూ, బాయిలర్లలోనూ ఇంధనంగా వాడతారు.
పిండిలో ప్రోటీన్లు అధికంగా ఉంటుంది. అందుకే పశువులకు దానాగా కూడా ఉపయోగిస్తారు.
ఒలిచిన ప్రొద్దుతిరుగుడు పప్పు పెంపుడు పక్షులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
ప్రొద్దుతిరుగుడు ఔషధాల తయారీకీ, రంగులు వేయడానికీ ఉపయోగిస్తారు.
1510లో స్పానిష్ పరిశోధకులు మొట్టమొదట న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలను స్పెయిన్‌కు తీసుకెళ్లారట. అక్కడినుంచి ఈ విత్తనం మిగిలిన ఐరోపా, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు ప్రాకింది.
రష్యా, యుక్రెయిన్లు పొద్దుతిరుగుడు పంటను విస్తారంగా పండిస్తారు..

పొద్దుతిరుగుడు పువ్వు 1 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్కడక్కడ 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.
కిరణజన్య సంయోగ క్రియ సులభంగా జరగడానికి మొగ్గ విడవడానికి ముందు రక్షక పత్రాలు వంటి స్కేల్ లీవ్స్ సూర్యునివైపు తిరుగుతాయి.
మొగ్గ విడవడానికి ఒకటి రెండు రోజులు ముందు మొగ్గ స్థిరంగా తూర్పు దిక్కుగా తిరుగుతుంది. రేకలు వెనుక ఆకుపచ్చ రంగు నుంచి పసుపుపచ్చ రంగుగా మారిన వెంటనే వీటిని కోస్తారు.

ట్రెండింగ్ వార్తలు