Polimera 2 issue : ఫిలిం ఛాంబ‌ర్‌ను ఆశ్ర‌యించిన పొలిమేర 2 నిర్మాత‌..

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ పై పొలిమేర 2 సినిమాని గౌరీ కృష్ణ నిర్మించారు.

Polimera 2 issue : శ్రీకృష్ణ క్రియేష‌న్స్ పై పొలిమేర 2 సినిమాని గౌరీ కృష్ణ నిర్మించారు. కాగా.. ఇటీవ‌ల వంశీకృష్ణ నందిపాటి నిర్మాత‌గా పొలిమేర 3 సినిమాను అనౌన్స్ చేశారు. పొలిమేర 2 సినిమాకి వంశీకృష్ణ పంపిణీదారుడిగా ఉన్నారు. అయితే.. పొలిమేర 2 సంబంధించిన డ‌బ్బుల‌ను వంశీ కృష్ణ ఇవ్వాల్సి ఉండ‌ని, త‌న అనుమ‌తి లేకుండానే పొలిమేర 3ని అనౌన్స్ చేశార‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌లో గౌరీ కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు దిల్ రాజుకి ఓ లేఖ రాశారు.

గ‌త ఏడాది న‌వంబ‌ర్ 27 తేదీన వంశీకృష్ణ నందిపాటి, అత‌డి టీం పై ఫిర్యాదు చేశాన‌ని, ద‌య‌చేసిన దాన్ని ప‌రిశీలించాల‌ని అందులో కోరారు. ఫిలిం ఛాంబ‌ర్ కి చెందిన నిర్మాత ప్ర‌స‌న్న‌కుమార్ తన ప‌వ‌ర్‌ను మిస్ యూజ్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న ఇష్యూలో త‌ల‌దూర్చి త‌న‌ను బెద‌రిస్తున్నార‌ని, కొన్ని డాక్యుమెంట్ల‌పై సంత‌కం చేయాల‌ని బెదిరిస్తున్నార‌ని తెలిపారు. ఇంకోవైపు వంశీ త‌న‌ను చెంపేస్తాన‌ని బెదిరిస్తున్నాడ‌న్నారు.

‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్.. అశ్విన్ బాబు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో..

‘రిఫండ‌బుల్ అడ్వాన్స్ బేసిస్ మీద నా వ‌ద్ద వంశీకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను కొనుగోలు చేశాడు. అయితే.. ఇంత వ‌ర‌కు కూడా ఆ సినిమాకి సంబంధించిన క‌లెక్ష‌న్ల వివ‌రాలు నాకు చెప్ప‌లేదు. వాస్త‌వానికి సినిమా విడుద‌ల స‌మ‌యంలో నాకు అడ్వాన్స్ ఇచ్చి నా వ‌ద్ద బ్లాంక్ చెక్కులు, సంత‌కం చేసిన బ్లాంక్ లెట‌ర్లు, బ్లాంక్ బాండ్ పేప‌ర్లు సెక్యూరిటీగా తీసుకున్నారు. వాటి ద్వారా ఇప్పుడు న‌న్ను బెదిరిస్తున్నారు.’ అని గౌరీ కృష్ణ చెప్పారు.

అంతేకాకుండా త‌న‌కు చెప్ప‌కుండానే పొలిమేర 3 సినిమాను అనౌన్స్ చేసిన‌ట్లుగా గౌరీ కృష్ణ ఆరోపించారు. పొలిమేర 2 నిర్మాత‌గా త‌న హ‌క్కుల‌ను ఇది కాల‌రాయ‌డ‌మేన‌ని తెలిపారు. తెలుగు ఫిలిం చాంబ‌ర్ న్యాయం వైపు నిల‌బ‌డుతుంద‌ని న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు. ఈ విష‌యంలో ఛాంబ‌ర్ వీలైన వేగంగా స్పందించి న్యాయం చేయాల‌ని కోరారు. పొలిమేర 2 సినిమా క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌ను, తాను సైన్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఇప్పించాల‌న్నారు. అలాగే పొర‌మేర 3లో పొర‌మేర 2కి సంబంధించిన కంటెంట్‌ను వాడ‌కుండా చూడాల‌ని కోరుతున్న‌ట్లు లేఖ‌లో గౌరీకృష్ణ పేర్కొన్నాడు.

Suriya 44 : సూర్య 44 సినిమా గ్లింప్స్ చూశారా? గ్యాంగ్‌స్టర్ గా సూర్య..

ట్రెండింగ్ వార్తలు