Game Changer : రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండ‌గే.. ‘గేమ్ ఛేంజ‌ర్’ పై త‌మ‌న్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

సినీ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజ‌ర్ ఒక‌టి.

Music Director SS Thaman gives Game Changer movie Update

Game Changer – SS Thaman : సినీ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజ‌ర్’ ఒక‌టి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఈ పాటికే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ ప‌డుతోంది. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇటీవ‌ల నిర్మాత దిల్‌రాజు చెప్పాడు. అయితే.. తాజాగా ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ త‌మ‌న్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.

జామ్ జంక్ష‌న్ అనే ఓ మ్యూజిక్ ప్రోగ్రాంలో పాల్గొన్న త‌మ‌న్ మాట్లాడుతూ గేమ్ ఛేంజ‌ర్ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌ను చెప్పారు. గేమ్ ఛేంజ‌ర్‌లో మొత్తం ఏడు పాట‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలతో పాటు.. ఆగ‌స్టులో మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.

Polimera 2 issue : ఫిలిం ఛాంబ‌ర్‌ను ఆశ్ర‌యించిన పొలిమేర 2 నిర్మాత‌..

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే మూవీ షూటింగ్ కూడా అయిపోతుందని తెలుస్తుంది. కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు