Pakistan : బొమ్మ తుపాకీలంటేనే వణికిపోతున్న పాకిస్థానీలు..బ్యాన్ చేయాలంటూ డిమాండ్

బొమ్మ తుపాకీలంటేనే పాకిస్థానీలు వణికిపోతున్నారు. అటువంటివాటిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

pakistan : పిల్లల్లో మానసిక సమస్యలకు కారణమవుతున్న టాయ్ గన్‌ల అమ్మకాలపై కఠినమైన నిషేధం విధించాలని ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ (APPSF) పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. బొమ్మ గన్‌లు పిల్లల్లో అనేక మానసిక సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపింది. పాకిస్థాన్ ప్రభుత్వం బొమ్మ గన్‌లని, కృత్రిమ గన్‌లని బ్యాన్ చేయాలని APPSF ప్రెసిడెంట్ కాషిఫ్ మీర్జా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొమ్మ తుపాకీల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని..వాటిని నిషేధించాలని శుక్రవారం (మే 7,2022) డిమాండ్ చేశారు.

బొమ్మ తుపాకీలతో పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతుందని మీర్జా అన్నారు. ఎవరైతే బొమ్మ పైరింగ్ తుపాకీలతో ఆడుకుంటున్నారో.. వారు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారని..బొమ్మ గన్‌లతో ఆడడం వల్ల పాకిస్థానీ యువకుల్లో హింసాత్మక ధోరిణి..నేరాలను చేయాలనే ఆలోచన పెరుగుతుంది అని అన్నారు.

ఎంత తొందరగా వీలైంతే.. అంత తొందరగా కృత్రిమ, బొమ్మ తుపాకీలపై నిషేధం విధించాలని కోరారు. ఆ బొమ్మలు అమ్మేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా 2017లో మాజీ కరాచీ కమిషనర్ కూడా బొమ్మ తుపాకీల సేల్స్‌పై నిషేధం విధించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కృత్రిమ తుపాకీలు చిన్నారుల మెదళ్లలో ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

2017లో, మాజీ కరాచీ కమిషనర్ కూడా సింధ్ హోమ్ డిపార్ట్‌మెంట్‌కి ఒక లేఖ రాశారు, బొమ్మ తుపాకుల అమ్మకాలను నిషేధించాలని అభ్యర్థించారు. అప్పట్లోనూ బొమ్మ తుపాకీలపై చాలా ఫిర్యాదులు అందాయి. దాంతో కరాచీ పోలీసులు బొమ్మ తుపాకీల షాపులపై దాడులు నిర్వహించి, వేలాది సంఖ్యలో బొమ్మ తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత షాపు ఓనర్లను అరెస్ట్ చేశారు. కాగా సింధ్ అసెంబ్లీ 2015లో కూడా కృత్రిమ తుపాకీల తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది.

ట్రెండింగ్ వార్తలు