తీవ్ర విషాదం.. డ్యామ్ కుప్పకూలి 40 మందికి పైగా మృతి

ఈ మేరకు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. 

కెన్యాలో డ్యామ్ కుప్పకూలి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు నైరోబీకి ఉత్తరాన ఉన్న ఓ పట్టణంలోని డ్యామ్ వద్ద నీటి ప్రవాహం పెరిగిపోయింది. దీంతో ఆ డ్యామ్ ఒక్కసారిగా పగిలిపోయి సమీపంలోని ప్రజలకు ముంచెత్తింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బురదలో చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. రిఫ్ట్ వ్యాలీలోని మై మహియు సమీపంలో ఆ డ్యామ్ వరదల తీవ్రతకు పగిలిపోవడంతో ఇళ్లు కొట్టుకుపోయాయని, రోడ్డు తెగిపోయిందని అధికారులు వివరించారు. చాలా మంది గల్లంతయ్యారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో మార్చి 15 నుంచి కెన్యాలో తీవ్ర స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. వరదల ధాటికి వేలాది మంది ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. వరదల ధాటికి చాలా మంది ప్రజలు బురదలో చిక్కుకుపోతున్నారు. ఇళ్లు మునిగి కొట్టుపోయే పరిస్థితులు నెలకొనడంతో కొందరు పైకప్పులపై చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుపోయిన వారికి కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

Also Read: మరో రెండేళ్లలో దేశంలో జరిగేది ఇదే..: కొత్తగూడెంలో జేపీ నడ్డా

ట్రెండింగ్ వార్తలు