Apple CEO Tim Cook: ప్రాథమిక పాఠశాలలోనే కోడింగ్ నేర్పించాలి.. నేటితరం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన భాష.

ప్రతిఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని, ప్రాథమిక పాఠశాలలోనే దీనిపై తరగతుల బోధన జరగాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. ఇది ప్రతిఒక్కరూ నేర్చుకోగల అత్యంత ముఖ్యమైన భాష అన్నారు.

Apple CEO Tim Cook: ప్రతిఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని, ప్రాథమిక పాఠశాలలోనే దీనిపై తరగతుల బోధన జరగాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. అవుట్‌లెట్‌ ఇంటర్వ్యూలో పలు విషయాలను టిమ్ కుక్ ప్రస్తావించారు. ముఖ్యంగా పాఠశాలలో కోడింగ్ నైపుణ్యాలను నేర్పడం గురించి, దాని ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. ప్రతిఒక్కరూ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ చేయడానికి ముందు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని నేను భావిస్తున్నాని, అయితే, ఇది ప్రాథమిక పాఠశాలలో బోధించబడాలని నా భావన అని చెప్పాడు.

North Korea Ballistic Missile: జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. సీరియస్‌గా రియాక్ట్ అయిన జపాన్

వాస్తవానికి మీ స్థానిక భాష కమ్యూనికేషన్ కోసం చాలా ముఖ్యమైనది, కానీ ప్రోగ్రామింగ్ భాష అనేది మీ సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఒక మార్గం అన్నారు. కుక్ చాలా సంవత్సరాలుగా ప్రారంభ విద్యా పాఠ్యాంశాల్లో ప్రోగ్రామింగ్‌ను చేర్చడాన్ని ప్రోత్సహించారు. ఇది గణితం, చరిత్ర వలె “కోర్ స్కిల్” అని 2019లో వాదించారు. ఈ వేసవిలో.. 500 మంది వ్యాపార లీడర్స్‌తో కలిసి కంప్యూటర్ సైన్స్ కోర్సులను చేర్చడానికి ప్రతి రాష్ట్రంలో K-12 పాఠ్యాంశాలను నవీకరించాలని యూఎస్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2026 నాటికి యూఎస్ 1.2 మిలియన్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కొరతను ఎదుర్కొంటుందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. 2021లో, బీఎల్ఎస్ ప్రకారం.. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ల మధ్యస్థ వార్షిక వేతనం 109,020 డాలర్లు. అయితే.. కొంతమంది విద్యార్థులు ప్రోగ్రామింగ్ కు విరుద్ధమైన విద్య, కెరీర్ నేపథ్యాలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు ఇప్పటికీ ఉద్యోగం పొందడానికి కష్టపడుతున్నారని నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు