ISS Module Alert : అంత‌రిక్ష కేంద్రంలో అగ్నిప్రమాదం.. మోగిన స్మోక్ సైరన్లు.. అసలేం జరిగింది?

అంతరిక్షంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పోగ కమ్మేసింది... వెంటనే స్మోక్ సైరన్ అలారమ్స్ మోగాయి.. వ్యోమగాములు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటన రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగింది.

Russia ISS module Smoke : అంతరిక్షంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పోగ కమ్మేసింది… వెంటనే అక్కడి స్మోక్ సైరన్ అలారమ్స్ మోగాయి.. అంతే.. వ్యోమగాములు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటన రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ISS మాడ్యుల్ వద్ద జరిగిందని రష్యా స్పేస్ ఏజెన్సీ, NASA తెలిపింది. రష్యా సిగ్మెంటులో (01:55 GMT) గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని రష్యా స్పేస్ ఏజెన్సీ Roscosmos ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యాకు చెందిన Zvezda service moduleలో వ్యోమగాములు నివ‌సించే క్వార్ట‌ర్లు ఉన్నాయి.

ఇందులో ఆటోమాటిక్ బ్యాటరీ చార్జింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొగ వ్యాపించి అలారమ్స్ మోగాయని రష్యా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో ఇటీవల వ‌రుస‌గా అగ్నిప్ర‌మాదాలు జరుగుతున్నాయి. రష్యా మాడ్యుల్ లో ఏదో ప్లాస్టిక్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువు కాలుతున్న వాసన రావడంతో వ్యోమగాములు అలర్ట్ అయ్యారు. వెంటనే దాన్ని ఆర్పివేసినట్టు ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్వ్యూట్ తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్ట‌మ్స్ నిర్జీవంగా ఉండమే దీనికి కార‌ణ‌మ‌ని ర‌ష్యా అధికారి హెచ్చరించారు. అన్ని సిస్ట‌మ్స్ సాధార‌ణ స్థాయికి వ‌చ్చిన‌ట్లు Roscosmos స్పేస్ ఏజెన్సీ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది.
Online Games : ఆన్‌లైన్‌ గేమ్స్‌ రీచార్జ్ కోసం దొంగగా మారిన బాలుడు

ర‌ష్యా సెగ్మెంట్ నుంచి అమెరికా మాడ్యూల్ వరకు కాలిన వాస‌న పొగ వ్యాపించినట్టు గుర్తించారు. వెంటనే వ్యోమగాములు ఫిల్ట‌ర్‌ను ఆన్ చేశారు. దాంతో అక్క‌డ‌ గాలి మొత్తం క్లీన్ అయింది. స్పేస్ వాక్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని నాసా పేర్కొన్న‌ది. నౌకా సైన్స్ మాడ్యూల్‌ను ఇటీవలే ర‌ష్యా స్పేస్ స్టేష‌న్‌కు పంపించింది. ఇద్ద‌రు కాస్మోనాట్స్ ఈ మాడ్యుల్‌ కు మరమ్మత్తులు చేస్తున్నారు. రష్యాకు చెందిన Oleg Novitsky, Pyotr Dubrov వ్యోమగాములు స్టేషన్ మాడ్యుల్ వదిలి వెళ్లనున్నారు. గతంలోనూ అంతరిక్ష కేంద్రంలో సాఫ్ట్ వేర్ ఔట్ డేట్ కావడంతో అక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రష్యా సిగ్మెంట్ లో భాగమైన Zvezda service మాడ్యుల్ కు కూడా 2019 నుంచి పలుమార్లు సాంకేతికపరమైన సమస్యలు తలెత్తాయి.

1998లో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రాన్ని నిర్మించారు. ర‌ష్యా, అమెరికా, కెన‌డా, జ‌పాన్‌, యురోపియ‌న్ దేశాలు ఈ స్పేస్ సెంటర్‌ను సంయుక్తంగా నిర్మించాయి. 15 ఏళ్లపాటు ఈ అంతరిక్ష కేంద్రాన్నిరూపొందించారు. గత జూలై నెలలోనే Nauka Module త్ర‌స్ట‌ర్లు వాటింతంట అవే ఆన్ అయ్యాయి. దాంతో స్పేస్ స్టేష‌న్ కొంతవరకు ప‌క్క‌కు జ‌రిగింది. హార్డ్‌వేర్ పనితీరు తగ్గిపోతున్న క్రమంలో రష్యా గతంలోనే 2025 తర్వాత ISSను వదిలి సొంత కక్ష్య స్టేషన్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
Pizza Party In Space : అంతరిక్షంలో పిజ్జా పార్టీ.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు