Bangladesh woman Love Indian Man : మొన్న పాకిస్థాన్ మహిళ, ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళ.. భారత్ యువకులతో విదేశీ వనితల ప్రేమ- పెళ్లి!

విదేశీ వనితలు భారత్ యువకులపై మనస్సు పారేసుకుని దేశాలు దాటి వచ్చేయటం ఆసక్తికరంగా మారింది. మరోపక్క ఇటువంటి ఉదంతాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్న పాకిస్థాన్ మహిళ,ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళ ప్రేమ,పెళ్లిళ్లకు సోషల్ మీడియాలు..ఆన్ లైన్ గేములు వేదికవుతున్నాయా..?

Bangladeshi woman in love with Indian man : పబ్ జి ఆట (Pub G game)తో పరిచయం అయి సచిన్ అనే భారత యువకుడుపై మనస్సు పారేసుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ (Pakistani woman Seema Haider) పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి ఓ మహిళ భారత్ కు చెందిన యువకుడిపై మనసు పారేసుకుని వచ్చేసి.. వివాహం చేసుకుని కొంతకాలం తరువాత భర్తతో సహా కనిపించకుండాపోయిన ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. సదరు యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా విదేశీ వనితలు భారత్ యువకులపై మనసు పారేసుకుని దేశాలు దాటి వచ్చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటువంటి ఉదంతాలపై మరోపక్క ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కొంతకాలం క్రితం ఫేస్ బుక్ (Facebook) ద్వారా పరిచయం అయిన బంగ్లాదేశ్ కు చెందిన జూలీ అనే మహిళ (Bangladesh woman) యూపీకి చెందిన అజయ్ (UP Man Ajay) అనే యువకుడి ప్రేమలో పడిందట. అంతే తన 11 ఏళ్ల కూతురిని తీసుకుని యూపీలోని మొరాదాబాద్ కు వచ్చేసింది. హిందూ మతంలోకి మారింది. హిందూ సంప్రదాయం ప్రకారం అజయ్ ను వివాహం చేసుకుంది. కాపురం కూడా ప్రారంభించారు. కొంతకాలం గడిచిన తర్వాత  వీసా రెన్యువల్ కోసం అంటూ తన కుమార్తె, భర్త అజయ్ తో కలిసి బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లింది. రెండు నెలలు గడిచాయి.. ఇప్పటికీ ఆమె రాలేదు. అజయ్ కూడా రాలేదు.

Seema Haider : సీమా హైదర్ సోదరుడు, మామ పాక్ ఆర్మీలో… షాకింగ్ నిజం

దీంతో తన కొడుకు కోసం అజయ్ తల్లి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. తన కుమారుడిని భారత్ కు తిరిగి తీసుకురావాలని కోరింది. తన కుమారుడు బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లాక తనకు ఫోన్ చేసి తాను పొరపాటున సరిహద్దు దాటి బంగ్లాదేశ్ లోకి వచ్చేశానని 10, 15 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడని వెల్లడించింది. రెండు నెలలు గడిచిపోయినా తన కొడుకు ఇంకా తిరిగిరాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు లేఖ రాసారు. తన కొడుకును ఇండియాకు తీసుకురావాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్ తల్లితో మాట్లాడిన నంబర్ తీసుకుని ఫోన్ చేశారు. తాము అజయ్ తో మాట్లాడామని, తిరిగి వచ్చే ప్రయత్నాల్లోనే ఉన్నానని చెప్పాడని పోలీసులు తెలిపారు. కానీ రక్తంతో ఉన్న తన కుమారుడి ఫోటోలు తన ఫోన్ కు వచ్చాయని తన కుమారుడు క్షేమంగానే ఉన్నాడా, ఏమైనా జరిగిందా అని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Bihar : ప్రియుడు కోసం ప్రతీరోజు గ్రామాన్ని అంధకారం చేస్తున్న యువతి ..

పాకిస్థాన్ మహిళ సీమా హైదర్  తన నలుగురు పిల్లలతో సహా యూపీ యువకుడు సచిన్ వద్దకు వచ్చేసిన ఉదంతం తెగ వైరల్ అయ్యింది. దీని కారణం పాక్ కు భారత్ కు ఎంతోకాలంగా ఉండే శతృత్వమే అని అనుకోవచ్చు. ఈ క్రమంలో సీమా హైదర్ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో చేరాడని.. ఆమె మామ కూడా గులాం అక్బర్ పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నాడని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ కు చెందిన ఏజెంటా..? భారత రహస్యాలు తెలుసుకోవటానికి వచ్చిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో జూలి, అజయ్ బంగ్లాదేశ్ నుంచి తిరిగి రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అజయ్ తల్లి కొడుకు కోసం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు