మూడోసారి జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌.. మంత్రివర్గంలో మార్పులు

మంత్రివర్గంలో కూడా మార్పులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్‌లో సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Hemant Soren Sworn: జార్ఖండ్‌ ప్రయోజనాల కోసం అన్ని పనులను తమ ప్రభుత్వం చేపడుతుందని సీఎం హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీవీ రాధాకృష్ణన్‌ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.

జార్ఖండ్‌లో మహాకూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్‌ సోరెన్‌ అన్నారు. జార్ఖండ్‌ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పనులను తమ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. జార్ఖండ్‌ 13వ సీఎంగా ఆయన రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ సీవీ రాధాకృష్ణన్‌ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జూలై 4న మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. జనవరి 31న మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన వారసుడిగా చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

చంపై సోరెన్‌ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత హేమంత్‌ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. సోరెన్‌ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్‌ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గంలో కూడా మార్పులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్‌లో సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అంతరిక్షంలోకి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం ఉందా.. ఇస్రో చీఫ్‌ ఏం చెప్పారంటే?

సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్‌ ఇకపై కోఆర్డినేషన్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు. బుధవారం జరిగిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా సమావేశంలో శాసనసభాపక్ష నేతగా హేమంత్‌ సోరెన్‌ను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు