సొంత కొడుకుని పోలీసులకు పట్టించిన తల్లి.. బయటపడిన సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 300 ఎంఎల్‌ గంజాయిని తీసుకొచ్చినట్లు నిందితుడు తెలిపాడు.

సొంత కొడుకుని పోలీసులకు పట్టించింది ఓ తల్లి. చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ్ అనే యువకుడు లోడ్ వాహన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గంజాయి ఆయిల్‌కు అలవాటు పడ్డాడు. ఈ విషయం అతడి తల్లి భాగ్యలక్ష్మికి తెలిసింది. కొడుకు ఇలా చెడిపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది.

దీనిపై ఎంకేబీ నగర్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో శ్రీరామ్ ఇంటికి వచ్చిన పోలీసులు తనిఖీలు చేసి 630 మిల్లీలీటర్ల గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని ధర రూ.2 లక్షలు ఉంటుందని చెప్పారు. శ్రీరామ్‌ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఆ గంజాయి ఎక్కడిదని ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి.

ఒడిశా నుంచి కార్గో ట్రిప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 300 ఎంఎల్‌ గంజాయిని తీసుకొచ్చినట్లు నిందితుడు తెలిపాడు. ఇటీవల కేరళకు చెందిన అరుణ్ అనే వ్యక్తి తనకు గంజాయి ఇచ్చి చెన్నైలోని మాధవరం ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తికి ఇవ్వాలని చెప్పాడని, ఆ పని చేశానని చెప్పాడు.

దీంతో పోలీసులు మాధవరంలోని ఆ వ్యక్తి అరుణ్ సోదరుడు సతీశ్ గా గుర్తించారు. పలువురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీరామ్ తో పాటు పలువురిని అరుణ్, సతీశ్ గంజాయి స్మగ్లింగ్ కు వాడుకుంటున్నట్లు తేల్చారు.

 Also Read: హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం.. వైద్యుడిపై తోటి వైద్యుల దాడి

ట్రెండింగ్ వార్తలు