VN Aditya New Movie Auditions Happened in America
VN Aditya : మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట.. లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు VN ఆదిత్య. త్వరలో ఆయన నుంచి మరిన్ని సినిమాలు రానున్నాయి. ఆల్రెడీ సినిమా పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. త్వరలో VN ఆదిత్య మరో కొత్త సినిమా తీయబోతున్నారు. తాజాగా ఆ సినిమాకి సంబంధించి అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించారు.
ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా VN ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ డల్లాస్ లోనే జరగనుందని VN ఆదిత్య తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవ్వనుంది.
Also Read : Kalki Collections : కల్కి అప్పుడే 900 కోట్లు.. వెయ్యి కోట్ల చేరువలో.. అన్ని చోట్ల ప్రాఫిట్స్‌తో దూసుకుపోతూ..
అయితే తాజాగా ఈ సినిమా కోసం ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించింది. ఈ ఆడిషన్స్ కి ప్రవాస భారతీయులు మాత్రమే కాక అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్.. ఇలా వేరే దేశాల కొత్త నటీనటులు కూడా ఆడిషన్స్ కి వచ్చారు. ఇలా బయటి దేశాల వాళ్ళు కూడా ఆడిషన్స్ కి రావడంతో దర్శకుడు వీఎన్ ఆదిత్య హర్షం వ్యక్తం చేశారు. ఈసారి VN ఆదిత్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.