హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం.. వైద్యుడిపై తోటి వైద్యుల దాడి

దీన్ని అమలు చేస్తే హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న వైద్యులు జిల్లాలకు..

హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద అలజడి చెలరేగింది. ఓ ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి దిగారు. దీంతో డీఎంఈ కార్యాలయం ఎదుట బాధిత వైద్యుడు వేఖర్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు.

దీన్ని అమలు చేస్తే హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాల్లో పని చేస్తున్న వారుహైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయని శేఖర్ తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేశ్, రాథోడ్, వినోద్ కుమార్ కుట్ర చేస్తున్నారని చెప్పారు.

తాను డీఎంఈకి వినతి పత్రం ఇవ్వకుండా అడ్డుకొని దాడి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరంలోనే వారు తిష్ట వేశారని చెప్పారు. వారి తీరును ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని అన్నారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఇక్కడే బైఠాయిస్తానని తెలిపారు.

Also Read: 256 గుడ్లతో ఏం తయారు చేశాడో చూడండి.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు