256 గుడ్లతో ఏం తయారు చేశాడో చూడండి.. వీడియో వైరల్

టేబుల్‌పై పిండిని ఉంచి దానిపై గుడ్ల సొనలను వేసి, గంట సేపు కలిపి, పిండిని షీట్‌లుగా..

256 గుడ్లతో ఏం తయారు చేశాడో చూడండి.. వీడియో వైరల్

ఇటాలియన్ ఫుడ్ పాస్తా అంటే చాలా మంది ఇష్టపడతారు. వెరైటీ పాస్తాలతో రెస్టారెంట్లు కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. తాజాగా కంటెంట్ క్రియేటర్ ర్యాన్ పీటర్స్‌ చేసిన పాస్తాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఎందుకంటే 256 కోడిగుడ్లతో అతడు ఈ పాస్తాను చేశాడు. పాస్తా చేయడంతో నిష్ణాతుడైన ర్యాన్ పీటర్స్ సమయం దొరికితే చాలు ఇటువంటి వీడియోలు చేస్తుంటాడు. పాస్తా తయారీలో గుడ్డు సొనల సంఖ్యను రెట్టింపు చేస్తూ వరుసగా వీడియోలు పెడుతున్నాడు. గత వీడియోలో చూపిన దాని కంటే ఈ సారి రెట్టింపు గుడ్లను (256) వాడాడు.

టేబుల్‌పై పిండిని ఉంచి దానిపై గుడ్ల సొనలను వేసి, గంట సేపు కలిపి, పిండిని షీట్‌లుగా చేసి, పాస్తా కట్టర్ ని వాడుతూ చివరకు పాస్తాను చేశాడు. ఇలా చేసిన ఆహారం వృథా కాకుండా స్థానిక సంస్థకు దాన్ని విరాళంగా ఇస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అతడికి కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రెటీలతో కలిసి కూడా అతడు పాస్తా చేస్తుంటాడు. రకరకాల పాస్తాలతో అందరినీ ఆకర్షిస్తుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by 𝙋𝙚𝙩𝙚𝙧𝙨𝙋𝙖𝙨𝙩𝙖 🍝 (@ryanpeterspgh)

Also Read: లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలే: హీరో రాజ్‌త‌రుణ్‌