PCB submits Champions Trophy draft schedule to ICC
ICC Champions Trophy 2025 : టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 19 వరకు ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందజేసింది. అయితే.. ఈ షెడ్యూల్ కు బీసీసీఐ ఇంకా తమ సమ్మతిని తెలపలేదు.
పాక్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. వీటిలో ఏడు మ్యాచులకు లాహోర్, మూడు మ్యాచులకు కరాచీ, ఐదు మ్యాచులకు రావల్సిండి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులు విభజించారు. గ్రూపు ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూపు బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి.
భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టీమ్ఇండియా మ్యాచ్‌లు అన్నీ కూడా లాహోర్‌లోనే జరగనున్నాయి. ఒకవేళ భారత్, సెమీ ఫైనల్, ఫైనల్‌కు క్వాలిఫై అయితే.. ఆ మ్యాచ్‌లను కూడా లాహోర్‌లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీకి పీసీబీ తెలిపింది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదరుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మార్చి 1న జరగనుంది.
కాగా.. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా 2008 నుంచి భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించడం లేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు పాక్‌లో పర్యటించేది లేనిది ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్‌కు వెళ్లనుంది.
Also Read : స్మృతి మంధాన మనసులో ఉంది ఇతడేనా..? 5 ఏళ్ల అనుబంధం..! ఇంతకీ ఇతను ఎవరంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాప్ట్ షెడ్యూల్..
ఫిబ్రవరి 19 – న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ – కరాచీ
ఫిబ్రవరి 20 – బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ – లాహోర్
ఫిబ్రవరి 21 – అఫ్గానిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా – కరాచీ
ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ – లాహోర్
Also Read: మూడో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్‌లకు తలనొప్పి.. జట్టులో ఎవరుంటారో..?
ఫిబ్రవరి 23 – న్యూజిలాండ్ వర్సెస్ భారత్ – లాహోర్
ఫిబ్రవరి 24 – పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ – రావల్పిండి
ఫిబ్రవరి 25 – అఫ్గానిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ – లాహోర్
ఫిబ్రవరి 26 – ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా – రావల్పిండి
ఫిబ్రవరి 27 – బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ – లాహోర్
ఫిబ్రవరి 28 – అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా – రావల్పిండి
మార్చి 1 – పాకిస్థాన్ వర్సెస్ భారత్ – లాహోర్
మార్చి 2 – దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ – రావల్పిండి
మార్చి 5 – సెమీ ఫైనల్ 1 – కరాచీ
మార్చి 6 – సెమీ ఫైనల్ 2 – రావల్పిండి
మార్చి 9 – ఫైనల్ – లాహోర్