ODI World Cup 2025 : వరల్డ్ కప్ ఓపెనింగ్ కి పాకిస్తాన్ డుమ్మా..!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (ODI World Cup 2025) ఓపెనింగ్ సెర్మనీ సెప్టెంబర్ 30న గౌహతిలోని బార్సపరా స్టేడియంలో నిర్వహించనున్నారు.

Pakistan womens team pulls out of ODI World Cup opening ceremony report
ODI World Cup 2025 : సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీ (ODI World Cup 2025) ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఈ వేడుకలో తన గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్థులను చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ ఓపెనింగ్ సెర్మనీకి పాకిస్తాన్ క్రికెట్ జట్టు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఓపెనింగ్ సెర్మనీ తరువాత కెప్టెన్ల ఫోటో షూట్, మీడియా సమావేశం జరగనున్నాయి. వీటికి కూడా పాక్ దూరం కానుందని జియో సూపర్ తెలిపింది.
Team India Jersey : డ్రీమ్ 11 ఎగ్జిట్ తరువాత.. భారత జట్టు జర్సీ చూశారా..? ఫోటోలు వైరల్
నివేదిక ప్రకారం.. ‘పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా లేదా పాకిస్తాన్ క్రికెట్ నుండి మరే ఇతర ప్రతినిధి ఈ వేడుకకు హాజరు కావడం లేదు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఉమెన్ ఇన్ గ్రీన్ ప్రారంభ వేడుక నుండి వైదొలగడానికి అతిపెద్ద కారణమని ఊహించబడింది.’అని పేర్కొంది.
2008 నుంచి భారత్, పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ మెగాటోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బీసీసీఐ, పీసీబీ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల్లో రెండు జట్ల మధ్య తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2025లో పాక్ ఆడే మ్యాచ్‌లు అన్ని కూడా శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. పాక్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 5న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది.
వన్డే ప్రపంచకప్ 2025కు పాక్ జట్టు ఇదే..
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఈమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సోహైల్, రమీన్ షమీమ్, సదాఫ్ సిక్బాల్, సాదియా సిక్బాల్, సాదియా ఇఖల్ , సాదియా ఇఖల్ నవాజ్ (వికెట్ కీపర్), సయ్యదా అరూబ్ షా .