Smriti Mandhana : స్మృతి మంధాన మనసులో ఉంది ఇతడేనా..? 5 ఏళ్ల అనుబంధం..! ఇంతకీ ఇతను ఎవరంటే..?
టీమ్ఇండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Smriti Mandhana - Palash Muchhal
Smriti Mandhana – Palash Muchhal : టీమ్ఇండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతోనే కాదు ఆటతీరుతోనూ పెద్ద సంఖ్యలో అభిమానులకు సంపాదించుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆమె మనసులో వ్యక్తి చోటు సంపాదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. కాగా.. వారి బంధానికి ఐదేళ్లు పూర్తి కావడం గమనార్హం.
సంగీతకారుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేసింది. మంధానతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను పలాష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేనా తమ మధ్య బంధానికి ఐదేళ్లు నిండాయి అని అర్థం వచ్చేలా ఐదు అంటూ హార్ట్ ఎమోజీలను జత చేశాడు.
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్‌లకు తలనొప్పి.. జట్టులో ఎవరుంటారో..?
View this post on Instagram
దీనిపై మంధాన స్పందించింది. లవ్ సింబల్స్‌తో తన సంతోషాన్ని తెలియజేసింది అమ్మడు. వీరి పోస్టులు వైరల్‌గా మారగా.. నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎవరీ పలాష్ ముచ్చల్..
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్ ముచ్చల్. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ మూవీల్లో పాలక్ పాటలు పాడగా.. 29 ఏళ్ల పలాష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
టీ- సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, పాల్ మ్యూజిక్ వంటి కంపెనీలతో మమేకమై 40కి పైగా మ్యూజిక్ వీడియోలు చేశాడు. ఖేలే హమ్ జీ జాన్ సే మూవీలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా వెబ్ సిరీస్ డైరెక్టర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు.